డాక్టర్ పాడుబుద్ధి.. ఐసోలేషన్ వార్డులో యువతిపై లైంగిక దాడి

Published : Jul 28, 2020, 01:53 PM IST
డాక్టర్ పాడుబుద్ధి.. ఐసోలేషన్ వార్డులో యువతిపై లైంగిక దాడి

సారాంశం

ఇరవై ఏళ్ల యువతికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు సైతం మహమ్మారి సోకగా... బాధితురాలితో కలిపి అతడిని ఒకే ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.

కరోనాతో పోరాడుతున్న రోగులకు కాపాడాల్సిన ఓ వైద్యుడు పాడు బుద్ధి చూపించాడు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇరవై ఏళ్ల యువతికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు సైతం మహమ్మారి సోకగా... బాధితురాలితో కలిపి అతడిని ఒకే ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.ఈ నేపథ్యంలో సదరు డాక్టర్‌ సోమవారం తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ విషయం గురించి అడిషనల్‌ డీసీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఆస్పత్రి యాజమాన్య వ్యవహార శైలి కూడా కారణమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు కోవిడ్‌ పేషెంట్లను ఒకే వార్డులో ఉంచి సేవలు అందించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బాధితురాలి ఫిర్యాదుకు తాము సత్వరమే స్పందించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నాడని, కోవిడ్‌ నిబంధనల ప్రకారం అతడి వాంగ్మూలం నమోదు చేస్తామని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం