ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025కి ప్రయాగరాజ్ వెళ్తున్నారా? అక్కడ ఓ మంచి టెంట్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారాా? అయితే ఇంట్లో కూర్చునే ఆన్ లైన్ లో టెంట్ బుక్ చేసుకోండి.
ప్రయాగరాజ్ : మహా కుంభమేళా 2025ని ప్రత్యేకంగా చేయడంలో ఉత్తరప్రదేశ్ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ నెల అంటే జనవరి 12వ తేదీ నుండి ప్రయాగరాజ్‌లో భక్తుల సందడి మొదలవుతుంది. స్నానం నుండి బస వరకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాను మీరు చూడాలనుకుంటే బస గురించి ఆందోళన పడకండి. యూపీ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రైవేట్ కంపెనీతో కలిసి గంగా నది ఒడ్డున డోమ్ సిటీని నిర్మిస్తోంది. ఇది మీకు షిమ్లా-మనాలి కంటే మెరుగైన అనుభూతిని ఇస్తుంది. దీనితో పాటు మీరు టెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలో, దాని ధరలు ఏమిటో మేము మీకు తెలియజేస్తాము.
మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి యూపీ టూరిజం మహా కుంభమేళా 2025 టెంట్ బుకింగ్ అని శోధించండి. పేజీ తెరుచుకున్న వెంటనే, మొదటి పేజీలో IRCTC (https://www.irctctourism.com/mahakumbhgram), UPSRTC (https://upstdc.co.in/website/default.aspx) వెబ్‌సైట్‌లు కనిపిస్తాయి.
మీరు UPSRTC వెబ్‌సైట్‌కి వెళ్ళినప్పుడు, మహా కుంభమేళాకు సంబంధించిన అంత సమాచారం మీకు లభిస్తుంది. ఇక్కడ మీకు విల్లా, కాటేజ్, స్విస్ కాటేజ్, వసతిగృహాల వంటి అనేక ఎంపికలు లభిస్తాయి. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం డబుల్ బెడ్ విల్లా అద్దె రూ.35000, కాటేజ్ రూ.24000, స్విస్ కాటేజ్ రూ.12000, వసతిగృహం రూ.1500 వున్నాయి.
UPSRTCతో పాటు మహా కుంభమేళాలో యూపీ పర్యాటక శాఖతో భాగస్వామ్యం కలిగిన కంపెనీల వెబ్‌సైట్‌ల ద్వారా కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు.
1) ఆగమన్- https://www.aagmanindia.com/
2) కుంభమేళా- https://www.kumbhcampindia.com/tent/swiss-tents/
3) రుషికుల్- https://www.rishikulkumbhcottages.com/
4) కుంభ విలేజ్- https://www.kumbhvillage.com/
5) శివద్య క్యాంప్స్: https://eracamps.com/tent-booking-kumbh-mela
యూపీ పర్యాటక వెబ్‌సైట్‌తో పాటు మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో కూడా టెంట్ బుకింగ్ చేసుకోవచ్చు. సైట్ తెరుచుకున్న వెంటనే మీకు కుంభమేళాకు సంబంధించిన అంత సమాచారం లభిస్తుంది. కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే టెంట్ ధరలు కూడా ఇవ్వబడ్డాయి. సూపర్ డీలక్స్ టెంట్ అద్దె రూ.18000, విల్లా రూ.20000. అదనపు బెడ్ కోసం రూ.5000 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. షాహీ స్నాన్ సమయంలో మహా కుంభమేళాను చూడాలనుకుంటే, మూడు రోజుల ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.
గమనిక- ఇక్కడ ఇవ్వబడిన టెంట్ బుకింగ్ ధరలు అధికారిక వెబ్‌సైట్ నుండి తీసుకోబడ్డాయి. ఇవి భవిష్యత్తులో మారవచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు IRCTC మరియు UPSRTC వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.