చైనాలో మరో కొత్త వైరస్ విజృంభణ ... ఏమిటీ HMPV, లక్షణాలేంటి?

By Arun Kumar P  |  First Published Jan 3, 2025, 11:18 AM IST

కరోనా వైరస్ చేదు జ్ఞాపకాలను ఇంకా మరిచిపోకముందే చైనాలో మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. ఈ కొత్త వైరస్ బారినపడి చైనాలో వేలాదిమంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంతకూ ఈ కొత్త వైరస్ ఏంటో తెలుసా? 


HMPV Virus : కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం ఇంకా కళ్లముందే కదలాడుతుంది. యావత్ ప్రపంచాన్ని ఓ స్మశానవాటికగా మార్చి మనిషి ప్రాణాలతో  చెలగాడం ఆడుకుంది ఈ వైరస్. కనీసం అయినవారు, ఆప్తులు చనిపోయినా వారిని చూసేందుకు కూడా వీలులేకుండా చేసింది... చివరకు జేసిబిలతో శవాలను పూడ్చే పరిస్థితి తెచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ కరోనా సృష్టించిన మారణహోమాన్ని మరిచిపోతున్నాం. అలాంటి దారుణ పరిస్థితి మళ్లీ రావద్దని ప్రతిఒక్కరు కోరుకుంటారు.

అయితే కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మరో ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారినపడి చైనా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా కొత్త వైరస్ వ్యాప్తితో చైనాలోని హాస్పిటల్స్ మళ్ళీ కిక్కిరిపోతున్నాయి. మళ్లీ కరోనా వ్యాప్తి సమయంలో కనిపించిన దృశ్యాలే ప్రస్తుతం చైనాలో కనిపిస్తున్నారు. దీంతో యావత్ ప్రపంచం మరోసారి ఆందోళనకు గురవుతోంది. 

Latest Videos

ఏమిటీ కొత్త వైరస్ : 

 

HMPV (హ్యూమన్ మెటానిమో వైరస్) ... ఇది ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్. ఇది సేమ్ టు సేమ్ కరోనా వైరస్ లక్షణాలనే కలిగివుంది. ఇది ఒకరినుండి మరొకరికి సోకే అంటువ్యాధి... దగ్గు,తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇలా ఈజీగా గాలిద్వారా వ్యాప్తిచెందే లక్షణాలున్న ఈ హెచ్ఎంపివి వైరస్ కేసులో చైనాలో అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి. 

ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలావుందో కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతుంది. అక్కడ హాస్పిటల్స్ అన్ని ఈ HMPV వైరస్ బారినపడ్డ వారితో నిండిపోయాయి... కరోనా సమయంలో మాదిరిగా హాస్పిటల్స్ వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. 

ఇక ఈ HMPV వైరస్ ప్రాణాంతకమైందిగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డ అనేకమంది చైనాలో మరణించినట్లు సోషల్ మీడియా మాద్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అక్కడ హాస్పిటల్స్ లో మళ్లీ కరోనా సమయంలో మాదిరిగా మృతుల సంఖ్య ఎక్కువగా వుంటోంది. 

HMPV లక్షణాలు : 

 

ఈ హెచ్ఎంపివి వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జలుబుతో ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇక దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఇది ప్రధానంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు సృష్టిస్తుంది... ఈ వైరస్ వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుంటుంది. ఇక జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

ఈ HMPV వైరస్ కొందరిలో చాలా సీరియస్ శ్వాస సమస్యలకు దారితీస్తుంది. ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. ఇది గాలిద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇది ఒక్కసారిగా విజృంభిస్తుంది... లక్షణాలు బయటపడేలోపే మరింతమందికి వ్యాప్తి చెందుతుంది. 

HMPV ఎలా వ్యాపిస్తుంది? 

 

హ్యూమన్ మెటానిమో వైరస్ గాలి ద్వారా ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ వైరస్ సోకినవ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్ గాల్లోకి చేరుతుంది. అక్కడ దగ్గర్లో వున్నవారిలోకి శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతుంది. 

ఇక ఈ వైరస్ సోకినవారికి జలుబు, ముక్కుకారడం వంటి లక్షణాలుంటాయి. కాబట్టి వారు తరచూ చేతులను నోటికి అడ్డుపెట్టుకోవడంగానీ, ముక్కు తుడుచుకోవడం గాని చేస్తుంటారు. ఇలాంటివారితో షేక్ హ్యాండ్, హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. 

HMPV వైరస్ సోకినవారు ఉపయోగించే వస్తువులను వాడటంద్వారా కూడా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.  

ఇలా HMPV వైరస్ కూడా కరోనా వైరస్ లక్షణాలనే కలిగివుంది. కాబట్టి ఇంటినుండి బయటకు వెళ్లేటపుడు మాస్కులు ధరించడం, రద్దీ ప్రదేశాలకు దూరంగా వుండటం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చేస్తుండాలి. 

HMPV వైరస్ ఎవరికి ఎక్కువ ప్రమాదం : 

 

HMPV వైరస్ సాధారణ జలుబు లక్షణాలనే కలిగివుంటుంది. ఆరోగ్యంగా వున్నవారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపించదు.. కేవలం నాలుగైదు రోజుల్లో రికవరీ కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఐదేళ్లలోపు చిన్నారులు, వృద్దులకు ఈ వైరస్ సోకితే జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. వీరిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం వుంటుందని... కాబట్టి వారికి వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం వుంటుందని అంటున్నారు. 

ఇక ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్,హెచ్ఐవి వంటివాటితో బాధపడేవారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుంది. వారిలో ఇమ్యూనిటీ సిస్టంను మరింత దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు వున్నవారిపై కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుంది. 

వైరస్ నిర్దారణ, చికిత్స : 

 

HMPV వైరస్ సోకినవారికి ప్రత్యేక లక్షణాలేమీ కనిపించవు... సాధారణ జలుబు, దగ్గు లాగే    వుంటుంది. చాలామందిలో ఇది కేవలం నాలుగైదు రోజుల్లో నయం అవుతుంది. కాబట్టి దీన్ని నిర్దారించడం చాలా కష్టం. పిల్లలు, వృద్దులు శ్వాస సంబంధిత సమస్యను బాగా ఎదుర్కొంటుంటే హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం అందించాలి. 

ఈ వైరస్ నిర్దారణ అయినా నయం చేయడానికి ఎలాంటి యాంటివైరస్ మెడిసిన్స్ లేవు. కాబట్టి శ్వాస సమస్యను తగ్గించేందుకు బయటనుండి ఆక్సిజన్ అందించడం, ఐవి ప్లూయిడ్స్ ఇవ్వడం వంటివి చేస్తుండాలి. ఇలా సాధారణ వైద్యం అందించడంతప్ప దీనికి ప్రత్యేక వైద్యం అంటూ ఏమీలేదు. 

చైనాలో HMPV తో పాటు మరిన్ని వైరస్ లు :
 

గత కొన్ని రోజులుగా ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ తో చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు ఇన్‌ఫ్లుఎంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా కూడా చైనాలో పెరిగిపోయింది. ఇవి చాలవన్నట్టు మళ్లీ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి మొదలయినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు హెచ్చరిస్తున్నాయి. 

ఇలా వైరస్ ల వ్యాప్తితో చైనాలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైరస్‌ సోకి మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మార్చురీలు, శ్మశాన వాటికల్లో స్థలం దొరకడం లేదనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వైరస్ ల వ్యాప్తిని నివారించడానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. 

అధికారికంగా ఈ వైరస్ ల వ్యాప్తిపై చైనా ఎలాంటి సమాచారం బైటపెట్టడంలేదు. వైరస్ వ్యాప్తి వుందనిగానీ, లేదనిగానీ చెప్పడంలేదు. గతంలో కోవిడ్ సమయంలో కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది. దీంతో ఆ దేశ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. 

 

⚠️ BREAKING:

China 🇨🇳 Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums.

Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China. pic.twitter.com/GRV3XYgrYX

— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease)

 భారతీయులు జాగ్రత్త :

 

పొరుగుదేశం చైనాలో HMPV తో పాటు ఇతర వైరస్ ల వ్యాప్తి ఎక్కువగా వున్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా వుండాలి. అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. మళ్లీ మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా HMPV తో ప్రమాదం ఎక్కువగా వుండే చిన్నారులు, వృద్దుల విషయంలో జాగ్రత్తగా వుండాలి. వైరస్ సోకాక చికిత్స పొందడంకంటే సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. 

 


 
 

click me!