ముంబై కొత్త పోలీస్ కమీషనర్‌గా వివేక్ ఫణ్‌షాల్కర్

By Siva KodatiFirst Published Jun 29, 2022, 10:20 PM IST
Highlights

ముంబై కొత్త పోలీస్ కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ వివేక్ ఫణ్‌షాల్కర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన  సంజయ్ పాండే రేపు పదవీ విరమణ చేస్తున్నారు. వివేక్ 1989 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. 

దేశ ఆర్ధిక రాజధాని ముంబై కొత్త పోలీస్ కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ వివేక్ ఫణ్‌షాల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కమీషనర్ గా కొనసాగిన సంజయ్ పాండే రేపు పదవీ విరమణ చేస్తున్నారు. ఇక 1989 బ్యాచ్ మహారాష్ట్ర ఐపీఎస్ కేడర్ కు చెందిన వివేక్.. మహారాష్ట్ర పోలీస్ శాఖ పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం థానే నగర పోలీస్ కమీషనర్ గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడానికి ముందు వివేక్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also REad:maharashtra crisis: విశ్వాస పరీక్షకు ముందే చేతులేత్తేసిన ఉద్ధవ్ థాక్రే.. సీఎం పదవికి రాజీనామా

అంతకుముందు రేపు విశ్వాస పరీక్షకు (maharashtra floor test) గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం జరిగిన మహారాష్ట్ర కేబినెట్ (maharashtra cabinet) సమావేశంలో ఉద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) ఎమోషనల్ అయ్యారు. తన వల్ల తప్పులేమైనా జరిగితే మన్నించాలని కోరారు. తనకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఉద్ధవ్. కేబినెట్ సమావేశం తర్వాత సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్ధవ్ థాక్రే మీడియాకు నమస్కరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇవాళ్టీ భేటీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని రెండు నగరాల పేర్లును మార్చింది. ఔరంగాబాద్ ను శంభాజీనగర్ గా, ఉస్మానాబాద్ ను ధార్‌శివ్ గా మార్చింది. అలాగే నవీ ముంబై ఎయిర్ పోర్టుకు డీబీ పాటిల్ విమానాశ్రయంగా మార్చుతూ ఉద్ధవ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

click me!