maharashtra crisis: ఉద్ధవ్ శిబిరానికి చుక్కెదురు.. రేపే విశ్వాస పరీక్ష పెట్టండి: సుప్రీం ఆదేశం

Siva Kodati |  
Published : Jun 29, 2022, 09:19 PM ISTUpdated : Jun 29, 2022, 09:32 PM IST
maharashtra crisis: ఉద్ధవ్ శిబిరానికి చుక్కెదురు.. రేపే విశ్వాస పరీక్ష పెట్టండి: సుప్రీం ఆదేశం

సారాంశం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ తగిలింది. రేపు ఉదయం విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలపరీక్ష వద్దంటూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చినసుప్రీం.. స్టే విధించేందుకు నిరాకరించింది. 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ తగిలింది. రేపు ఉదయం విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు స్పీకర్. బలపరీక్ష వద్దంటూ శివసేన దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చినసుప్రీం.. స్టే విధించేందుకు నిరాకరించింది. అలాగే అనర్హత ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలు సైతం బలపరీక్షలో ఓటు వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 

అంతకుముందు విశ్వాస పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రే దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. శివసేన తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ, ఏక్ నాథ్ షిండే తరపున ఎన్ కే కౌల్ వాదనలు వినిపించారు. మంగళవారం రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని దేవేంద్ర ఫడ్నవీస్ కలిసిన వెంటనే బలపరీక్ష ఆదేశాలు వచ్చాయని సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు శాసనసభ్యులు కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారని.. మరో ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో వున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష వద్దని సింఘ్వీ కోర్టును కోరారు. ప్రతిపక్షంతో రెబల్ ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారని సింఘ్వీ వాదించారు. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు బలపరీక్ష వద్దని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. 

Also REad:maharashtra Crisis: మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్వేగ సన్నివేశాలు.. క్షమించాలంటూ ఉద్ధవ్ ఎమోషనల్

కాగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులు వున్నారు. అధికార మహా వికాస్ అఘాడీ కూటమిలో ఇంతకుముందు శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44 మంది సభ్యుల బలం వుంది. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు వున్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యే షిండే.. తన వెంట 38 మంది శివసేన ఎమ్మెల్యేలు వున్నారని చెబుతున్నారు. దీంతో పాటు పది మంది స్వతంత్రులు కూడా మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. 

షిండే వర్గం, స్వతంత్రులు , బీజేపీకి మద్ధతిస్తే వారి బలం 154కి పెరుగుతుంది. అంటే సునాయాసంగా మెజార్టీ మార్క్ అయిన 144ను దాటేస్తుంది. ఇలా కాకుండా మరో వ్యూహాన్ని కూడా షిండే వర్గం అనుసరించే అవకాశం వుంది. శివసేన అసమ్మతి నేతలు 39 మంది సభకు హాజరుకాకపోతే... అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. అంటే ఉద్ధవ్ థాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్ధతు అవసరం. ప్రస్తుతం మహా వికాస్ అఘాడి సభ్యుల బలం 110 మాత్రమే. ఈ పరీక్షల్లో బలపరీక్ష జరిగితే థాక్రే సర్కార్ కుప్పకూలే ప్రమాదం వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!