maharashtra crisis: విశ్వాస పరీక్షకు ముందే చేతులేత్తేసిన ఉద్ధవ్ థాక్రే.. సీఎం పదవికి రాజీనామా

By Siva KodatiFirst Published Jun 29, 2022, 9:49 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. న్యాయస్థానం ఆదేశాల్ని గౌరవిస్తామని.. నా అనుకున్నవాళ్లే నమ్మకద్రోహం చేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పతనం వెనుక కేంద్రం కుట్ర వుందని ఉద్ధవ్ ఆరోపించారు. 

మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. గురువారం అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బాలా సాహెబ్ ఆశయాలు నెరవేర్చామని ఉద్ధవ్ అన్నారు. సోనియా గాంధీ, శరద్ పవార్ కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కేబినెట్ సమావేశంలో మంత్రులతో తన ఆలోచనలు పంచుకున్నానని.. మంత్రివర్గ భేటీలో తన సహచరుల్లో చాలా మందిని మిస్సయ్యానని ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. 

రెబల్ ఎమ్మెల్యేలకు ఏం కావాలో అది ఇచ్చానని.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానిక ప్రత్యర్ధుల దిష్టి తగిలిందని సీఎం అన్నారు. మా ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదని.. శివసేన ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని ఉద్ధవ్ థాక్రే గుర్తుచేశారు. న్యాయస్థానం ఆదేశాల్ని గౌరవిస్తామని.. నా అనుకున్నవాళ్లే నమ్మకద్రోహం చేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లను కూడా శివసేన మంత్రులను చేసిందని ఆయన గుర్తుచేశారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు ఉద్ధవ్ థాక్రే. తమ ప్రభుత్వ పతనం వెనుక కేంద్రం కుట్ర వుందని ఉద్ధవ్ ఆరోపించారు. 

click me!