పెజావర్ మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ కన్నుమూత

By narsimha lodeFirst Published Dec 29, 2019, 12:22 PM IST
Highlights

సుప్రసిద్ద పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ ఆదివారం నాడు కన్నుమూశారు. 

బెంగుళూరు: సుప్రసిద్ద పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామిజీ ఆదివారం నాడు కన్నుమూశారు. 88 ఏళ్ల స్వామిజీ అస్వస్థత కారణంగా కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన అప్పటి నుండి స్పృహలోకి రాలేదు. దీంతో ఆయన చివరి కోరిక మేరకు ఆదివారం నాడు ఉదయమే స్వామీజీని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తరలించారు.

శ్రీకృష్ణ మఠంలోనే వెంటిలేటర్ ను ఏర్పాటు చేశారు. ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేసి చికిత్స అందించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఆదివారం నాడు ఉదయం మఠంలోనే  పెజావర మఠాధిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ కన్నుమూశారు.

ఈ నెల 20వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో పెజావర మఠాధిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీని ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత ఆయన న్యుమోనియా  వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్టుగా వైద్యులు గుర్తించారు. న్యుమోనియాకు చికిత్స అందించారు. అయినా కూడ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు రాలేదు.  ఆరోగ్యం మరింత విషమంగా మారింది.

బ్రెయిన్ డిస్‌ఫంక్షన్ అని పరీక్షలో తేలిందని, ఇంకా స్పృహలోకి రాలేదని శనివారంనాడు వైద్యలు తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామీజీ అభిమతం మేరకు లైఫ్ సపోర్ట్‌తోనే ఇవాళ ఉదయం మఠానికి తరలించారు. 

అయితో ఇంతలోనే విషాదం ముంచుకొచ్చింది. స్వామీజీ సమాచారం తెలియగానే కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చేరుకున్నారు. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్టు ఉడిపి ఎమ్మెల్యే కె.రఘుపతి భట్ ప్రకటించారు.స్వామిజీ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 
 

click me!