మొదటి సంతానం వామిక పుట్టేముందు తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన విరుష్కా జంట. రెండో సంతానం విషయంలో మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. ప్రసవం అయ్యేవరకు విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
విరాట్ కోహ్లి కూతురు వామికతో ఓ రెస్టారెంట్లో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవలే విరాట్, అనుష్క జంట మరోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి మగబిడ్డ పుట్టగా.. ‘అకాయ్’ అని పేరు పెట్టినట్టుగా ప్రకటించారు. ఫిబ్రవరి 15న తమకు మగబిడ్డ పుట్టినట్టుగా ప్రకటించారు. విరాట్ కోహ్లీ దాదాపు నెల రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు.
దీనిమీద అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, వీరికి సంతానం కలిగిన విషయం పోస్ట్ చేయగానే ఈ ఊహాగానాలకు తెరపడింది. వామిక పుట్టేముందు తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన విరుష్కా జంట. రెండో సంతానం విషయంలో చాలా రహస్యంగా ఉంచారు.
విరాట్ కోహ్లి తన కూతురు వామికతో కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్‌లో కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియా అకౌంట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ ఫొటో లండన్‌లో తీశారు.
ఇక విరాట్, అనుష్కాల రెండో సంతానం ‘అకాయ్’ గురించి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ పేరు ఎందుకు పెట్టారు. దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి కూడా నెటిజన్లు తెగ ఆసక్తి కనబరిచారు.
Virat Kohli in a restaurant in London. pic.twitter.com/E20OWlxb1n
— Mufaddal Vohra (@mufaddal_vohra)Virat with Vamika ❤️😇 | pic.twitter.com/GxA3xlB0ch
— Virat Kohli FC™ (@ViratsPlanet)