లోకల్ ట్రైన్‌లో చెప్పుల‌తో కొట్టుకుంటూ మహిళల భీకర యుద్ధం.. వైరల్ వీడియో

Published : Jul 12, 2023, 05:11 PM IST
లోకల్ ట్రైన్‌లో చెప్పుల‌తో కొట్టుకుంటూ మహిళల భీకర యుద్ధం.. వైరల్ వీడియో

సారాంశం

Kolkata local train: లోకల్ ట్రైన్‌లో చెప్పుల‌తో కొట్టుకుంటూ మహిళల భీకర యుద్ధం చేశారు. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  

Women fight in Kolkata local train: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఉన్న వ్యక్తులు గొడవ పడటం గురించిన ఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో మనం ప్రతిరోజూ ఏదో ఒక వీడియో చూస్తూనే ఉంటాం. కారణం ఏదైనా కావచ్చు, కానీ బ‌హిరంగంగా ప్రజలు హింసను ఎంచుకోవడానికి వెనుకాడ‌టం లేదు. ఈ క్ర‌మంలోనే లోకల్ ట్రైన్‌లో చెప్పుల‌తో కొట్టుకుంటూ మహిళల భీకర యుద్ధం చేశారు. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

కోల్ క‌తా లోక‌ల్ ట్రైన్ లో చోటుచేసుకున్న ఒక ఘ‌ట‌న‌లో ప‌లువురు మ‌హిళ‌ల‌తో కూడిన బృందాలు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. చెప్పుల‌తో కొట్టుకుంటూ.. పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డారు. కొంత స‌మ‌యం ట్రైన్ లో నానాహంగామా సృష్టించారు. ఒక ప్ర‌యాణికురాలు ఈ ఘ‌ట‌న‌ను త‌న ఫోన్ లో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన జ‌నాలు ఇప్పుడు షాక్ అవుతున్నారు.. ! వైర‌ల్ గా మారిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోపై విభిన్న కామెంట్లు వ‌స్తున్నాయి.

లోకల్ ట్రైన్ లోని లేడీస్ బోగీలో కనిపించిన కొందరు మహిళలు ఒకరితో ఒకరు గొడవకు దిగారు. మహిళలు అరవడం, చెప్పులతో ఒకరినొకరు కొట్టుకోవడం, పిడిగుద్దులతో పోరాడటం, తిట్టుకోవ‌డం వీడియో దృశ్యాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ గొడవకు గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ మహిళలు వాగ్వాదానికి దిగడం చాలా భయానకంగా ఉంది. అక్కడే ఉన్న కొందరు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీడియో చివరలో, గొడవలో పాల్గొన్న ఒక మహిళ తన పక్కన నిలబడి ఉన్న బాలుడిపై ఒక వస్తువును విసరడం కనిపిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ
Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu