
కొన్ని సార్లు మనం చేసే పని మన మనస్సాక్షికి నచ్చకపోవచ్చు. కానీ తప్పనిసరి పరిస్థితితుల్లో ఆ పని చేయాల్సి వస్తే ఏం చేస్తాం ? ఆ భగవంతుడిపైనే భారం వేసి ఆ పనికి పూనుకుంటాం. తప్పయినా, ఒప్పయినా ఆయనే చూసుకుంటాడని వదిలేస్తాం. అయితే ఇలాగే ఓ వ్యక్తికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఏకంగా దేవాలయాన్నే దోచుకోవాలని అనుకున్నాడు. దాని కోసం ప్రణాళిక రచించాడు. అనుకున్నట్టుగానే ఆలయానికి వెళ్లాడు. ముందుగా దేవుడికి ప్రార్థన చేసి, కానుక పెట్టి, వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్లాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర దొంగతనం హర్యానా రాష్ట్రంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం రేవారి జిల్లాలో ఓ హనుమాన్ దేవాలయం ఉంది. ఆ ఆలయంలో చోరీ చేయాలని ఓ వ్యక్తి భావించాడు. తన ప్రణాళికలో భాగంగా అతడు ఆలయంలోకి ప్రవేశించాడు. మరి తను చేస్తున్నది తప్పని భావించాడో ఏమో తెలియదు గానీ.. దొంగతనం చేసేందు ముందు అక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం ముందు కొన్ని నిమిషాలపాటు కూర్చున్నాడు. ఈ సమయంలో ఇతర భక్తుల కదలికలను గమనించాడు.
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్ స్టర్ కుల్దీప్ జగినాను కాల్చి చంపిన క్రిమినల్స్..
అనంతరం స్వామివారి పాదాల వద్ద రూ.10 నోటు పెట్టాడు. హనుమాన్ చాలీసా పఠించాడు. కొన్ని నిమిషాల తరువాత, అదను చూసుకొని అతడు హుండీని తెరిచి నగదు కట్టలతో పారిపోయాడు. అయితే ఈ దొంగతనాన్ని పూజారి గమనించలేదు. ఆ రోజు ఆలయాన్ని మూసివేసి వెళ్లాడు. కానీ ఈ చోరిని మరుసటి రోజు ఉదయం గమనించాడు. అప్పుడే హుండీ పెట్టె తాళం పగులగొట్టి ఉండటాన్ని చూశాడు. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీంచారు. అందులో ఓ దొంగ చోరికి పాల్పడే ముందు దేవుడి పాదాల వద్ద ప్రార్థనలు చేస్తూ డబ్బులు సమర్పించడం కనిపించింది. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. రన్ వేపై దొర్లుతూ వెళ్లడంతో.. వీడియో వైరల్
ఇటీవల ఢిల్లీలోనూ ఇద్దరు దొంగలు విచిత్ర పని చేసి వార్తల్లో నిలిచారు. జూన్ 27వ తేదీన షహదారాలోని ఫర్ష్ బజార్ లో రాత్రి సమయంలో ఇద్దరు దంపతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనకాల నుంచి ఇద్దరు దొంగలు వారిని స్కూటీపై వెంబడించారు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో వారిని అడ్డుకొని, కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు, నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆ మహిళ వద్ద బంగారు ఆభరణాలు లేకపోగా.. ఆ వ్యక్తి జేబులో రూ.20 నోటు మాత్రమే లభించింది. దీంతో వారి పరిస్థితి చూసి దొంగలకు జాలి వేసింది. వారే తమ జేబులో నుంచి రూ.100 తీసి ఆ వ్యక్తి జేబులో పెట్టి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.