Viral Video | పెళ్లి మండపంలో కాల్పుల కలకలం..  నవ వధువు పరార్..  పోలీసుల గాలింపు ముమ్మరం ..  అసలేం జరిగింది..?

Published : Apr 10, 2023, 07:38 PM IST
Viral Video | పెళ్లి మండపంలో కాల్పుల కలకలం..  నవ వధువు పరార్..  పోలీసుల గాలింపు ముమ్మరం ..  అసలేం జరిగింది..?

సారాంశం

Viral Video | ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో వధువు చేసే పని శ్రుతి మించిపోయింది. ఎవరూ ఊహించిన పని చేయడంతో వధువు సహా ఇద్దరిపై కేసు నమోదు. దీంతో నవ దంపతులు, వధువు కుటుంబం పరారైంది. వారికోసం  పోలీసులు వెతుకుతున్నారు.

Viral Video | ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే. అందులో నవ దంపతులతో పాటు స్నేహితుల సందడి మామూలుగా ఉండదు.  కానీ.. వారు చేసే కొన్ని పనులు శ్రుతి మించుతున్నాయి. అసలు వారి చేష్టలు ఎవరి ఊహకు కూడా ఊహాకు అందడం లేదు. సోషల్ మీడియాలో ట్రెండ్ కోసమే.. ఓవర్ నైట్ పాపులారిటీ కోసం తెలియదు కానీ, పెళ్లి వేడుకల్లో  నవ దంపతులు, వారి స్నేహితులు చట్ట విరూద్దమైన పలు చేస్తున్నారు.  వివాదాల్లో ఇర్కుకుంటున్నారు. విమర్శల పాలవుతున్నారు.  

తాజాగా ఓ వధువు పెళ్లి మండపంలో చేసిన పని  వరుడుతో సహా అందరినీ భయాందోళనకు గురి చేసింది. పెళ్లి మండపంలోనే నవ వధువు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ క్రమంలో ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వధువు కోసం వెతుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో జరిగింది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. యూపీలోని హత్రాస్‌లో ఈ ఘటన  చోటుచేసుకుంది. సేలంపూర్ గ్రామంలోని ఓ గెస్ట్ హౌస్‌లో  శుక్రవారం రాత్రి ఓ పెళ్లి వేడుక జరిగింది. వివాహతంతులో భాగంగా నవ దంపతులు పూలదండలు మార్చుకున్నారు. అనంతరం పెళ్లి మండలంలో కూర్చొన్నారు. ఈ సందర్భంలో  నవవధువు రాగిణి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి  స్టేజీ పైకి వచ్చి.. అందరూ  చూస్తుండగానే.. నవ వధువు చేతిలో  రివాల్వర్‌ పెట్టాడు. ఆ నవ వధువు కూడా ఏమి ఆలోచించకుండా.. పైకి గురిపెట్టి..గాల్లోకి వరుసగా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది.

అనంతరం ఆ తుపాకీని ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేసింది.  పక్కనే ఉన్న వరుడు కొంత భయాందోళనతో అలాగే కూర్చొండిపోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లిడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పెళ్లి సందర్భంగా గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన వధువు, ఆ రివాల్వర్‌ను కలిగి ఉన్న ఆమె బంధువు గురించి కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఈ విషయమై కొత్వాలి హత్రాస్ జంక్షన్ ఇన్‌చార్జి గిరీష్ చంద్ గౌతమ్ మాట్లాడుతూ వైరల్ వీడియోపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. విచారణ అనంతరం బయటకు వచ్చే అంశాలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే పెళ్లి వేడుకల్లో తుపాకుల మోతలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని సంఘటనల్లో కొందరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 2019 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయుధ చట్టాన్ని సవరించింది. బహిరంగ సభల్లో, మతపరమైన కార్యక్రమాల్లో, విందు వినోదాదల్లో  లైసెన్స్‌ ఉన్న గన్స్‌తో కాల్పులు జరుపడాన్ని కూడా నేరమైన చర్యగా పేర్కొంది. ఈ నేరానికి పాల్పడిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశముందని పేర్కొంది.  

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?