No liquor ban : "నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను!" : చత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ మంత్రి

Published : Apr 10, 2023, 06:09 PM IST
No liquor ban : "నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను!" : చత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ మంత్రి

సారాంశం

No liquor ban :మద్యపానంపై చత్తీస్‌ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానం అనేది హానికరం కాదని, ఎక్కువగా తాగడం వల్లనే సమస్యలు వస్తాయన్నారు. తాను బ్రతికి ఉండగా మద్యపాన నిషేదం జరుగకుండా చూసుకుంటానని చెప్పారు. 

No liquor ban : స్వాతంత్య్రానికి ముందు,తరువాత కూడా మద్యపాన నిషేధానికి అనేక ఉద్యమాలు జరిగాయి.  అనేక మహిళా సంఘాలు, సామాజిక వేత్త, రాజకీయ నాయకులు, పత్రికలు, సంస్థలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు చేశారు. ఎన్ని సార్లు మద్య నిషేదాన్ని అమలు జరపి మళ్ళీ తీసివేశారో చరిత్ర చెప్తుంది. ఇలాంటి  మద్య నిషేధంపై  ఛత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్‌ మంత్రి, బస్తర్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి కవాసీ లఖ్మా సంచలన ప్రకటన చేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని  ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి .. మద్యాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారు. తన ఊపిరి ఉన్నంతా వరకు మద్యపాన నిషేదం అమలు కానివ్వను అంటూ సంచలన ప్రకటన చేశారు. 

మద్య నిషేధంపై మంత్రి మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వరకు బస్తర్‌లో మద్య నిషేధం ఉండదని అన్నారు. మితంగా మద్యం సేవించడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని, అతిగా సేవిస్తే మాత్రం ఆరోగ్యానికి హానికరం అన్నారు.  శనివారం జగదల్‌పూర్‌లోని బస్తర్‌లో బస చేసిన సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా ఈ  ప్రకటన చేశారు. ఆయన తన ప్రకటనతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. పతాక వార్తల్లో నిలిచారు. నిషేధంపై మంత్రిని ప్రశ్నించగా.. ఇక్కడి ప్రజలకు మద్యం తాగే స్టైల్ తెలియదని, మద్యం తాగి మనిషి చనిపోలేదని, అతిగా తాగితే వారే చనిపోతున్నారని , వైన్ ఔషధంగా సేవించాలని, అది మనిషిని దృఢంగా మారుస్తుందని చెప్పారు.
 
ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా గత రెండు రోజులుగా బస్తర్ డివిజన్ కేంద్రమైన జగదల్‌పూర్‌లో ఉండటం గమనార్హం. ప్రియాంక గాంధీ బస్తర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం సేవిస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. అతని ప్రకారం అతను మద్యం సేవించడం తప్పుగా భావించడం లేదు. వ్యవసాయ కూలీలు, అధిక బరువులు మోసే కూలీలు కూలి పనులకు మద్యం సేవిస్తున్నారని మంత్రి ఉదాహరణగా వివరించారు. ఇంతమంది మద్యం సేవించకుంటే పనిలేకుండా పోతుందన్నారు. విదేశాల్లో 100 శాతం మంది మద్యం సేవిస్తుంటే బస్తర్‌లో 90 శాతం మంది మద్యం సేవిస్తున్నారని చెప్పారు. బస్తర్‌లో మద్య నిషేధం ఎప్పటికీ జరగదని, ఇక్కడ సంస్కృతిలో ప్రతి కార్యక్రమంలో మద్యాన్ని ఉపయోగిస్తారని ఆయన అన్నారు. గిరిజనులకు మద్యం ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?