భార్య భర్తల బంధం జీవితంలో చాలా గొప్పది. ఒకరికి మరొకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి జీవించాలి అని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే, అందరి జీవితం ఆనందంగా ఉండకపోవచ్చు. కొందరు మాత్రం ఆనందమైన జీవితం కోసం త్యాగాలు చేయడానికి కూడా వెనకాడరు. తాజాగా, ఓ వ్యక్తి తన భార్య తో కలిసి ఉన్న ఓ క్యూట్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఆ వీడియోలో భార్యభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. భర్త ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటాడు. తన ప్లేట్ లో భోజనం అయిపోగానే మళ్లీ వడ్డించమని అడిగాడు. అయితే, అందులో గిన్నెలో అన్నం అయిపోవడంతో ఆమె తన ప్లేట్ లో అన్నం తీసి భర్తకు పెడుతుంది. కనీసం అతను అది గమనించలేదు. ఆమె మాత్రం సంతోషంగా తన భర్త కోసం తన భోజనాన్ని త్యాగం చేసింది. ఈ వీడియోని వారు సరదాగా రీల్ కోసం చేసి ఉండొచ్చు. కానీ, నెటిజన్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు.
భార్య అలా త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని నెటిజన్లు విమర్శించడం విశేషం. కొందరు ఆమె ప్రేమను చూసి మురిసిపోతుంటే, మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. అతను ఫోన్ చూస్తూ తింటున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. కొందరేమో, స్పూన్ తో తింటూ, చేతితో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అని కొందరు విమర్శిస్తున్నారు. కొందరేమో, భర్త మీద అంత ప్రేమ ఉంటే, కాస్త ఎక్కువ వండొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వారు సరదాగా తీసిన ఈ వీడియో, ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి హాట్ టాపిక్ గా మారింది.