
చత్తీస్ గఢ్ : ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దారుణంగా హత్య చేయడమే కాకుండా.. అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. మృతదేహాన్ని కాళ్లు, చేతులు, తల నరకడం.. ముక్కలు చేయడం లాంటి పాశవిక చర్యలకు దిగుతున్నారు. అలాంటి ఘటన చత్తీస్ గఢ్ లో వెలుగు చూసింది. ఓ వ్యక్తిని హత్య చేసిన ట్రక్ డ్రైవర్.. తలను మొండాన్ని వేరుచేసి.. మొండాన్ని ట్రక్ లో పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ట్రక్కును ఇంటి ముందు పార్కు చేసి.. హాయిగా నిద్రపోయాడు.
ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన సోమవారం రాత్రి చత్తీస్గడ్ సారంగడ్ బిలాయి గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు శంకర్ సాహుగా గుర్తించారు. నిందితుడు సర్సివా ప్రాంతంలో కార్గో ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహం నుంచి తలను వేరు చేశాడు. సోమవారం అర్ధరాత్రి తలలేని మొండాన్ని ట్రక్కులో వేసుకొని తన స్వగ్రామానికి 60కి.మీ.లు ప్రయాణించి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంటి ముందు ట్రక్కును పెట్టాడు. ఇంట్లోకి వెళ్లి నిద్రపోయాడు.
అనురాధరెడ్డి హత్య కేసు : పదిహేనేళ్లుగా సహజీవనం.. రూ.7లక్షల కోసం కిరాతకంగా హత్య..
అయితే అతను ఇంటికి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో కొంతమంది ట్రక్కులు మృతదేహాన్ని గమనించారు. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి స్వస్థలం గగోరీకి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గ్రామస్తులు ట్రక్కులోని మృతదేహాన్ని గమనించి నిరసనలు చేపట్టారు. వారి నిరసనల మధ్యే నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. నిందితుడు హత్య చేసింది ఎవరిని.. తల ఎక్కడ పెట్టాడు.. ఎందుకు హత్య చేశాడు.. అనే విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు.
అయితే, నిందితుడు ఒంటరిగా ఈ హత్య చేయలేదని, ఇతరుల ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినప్పుడు, అతని పరిస్థితి బాగా లేదు, పోలీసులు అతనికి నీరు అందించారు, కాని నిందితుడు దానిని తిరస్కరించాడు. అతను బీర్ తాగుతానని చెప్పాడు. నివేదికల ప్రకారం, నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. దీనిపై సర్శివా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ ఘోర ప్రమాదం.. అదుపు తప్పిన ట్రక్కు.. ముగ్గురు జవాన్లకు గాయాలు
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మృతదేహాన్నిముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. ఆ తరువాత తలను చెట్ల పొదల్లో పడేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపింది.
వారం రోజులు ముమ్మర దర్యాప్తు తరువాత మంగళవారం పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడు చంద్రమోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోని ఫ్రిజ్ లో ఉన్న మహిళ మిగతా శరీర భాగాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.