నడి రోడ్డుపై స్కూటర్ పై కపుల్ రొమాన్స్.. వైరల్ వీడియో..!

Published : May 16, 2023, 09:39 AM IST
నడి రోడ్డుపై స్కూటర్ పై కపుల్ రొమాన్స్.. వైరల్ వీడియో..!

సారాంశం

దీనిని రోడ్డుపై వెళ్తున్న మరికొందరు వీడియో తీసి షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి 6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.  

ఇటీవల ఢిల్లీ మెట్రోలో రెండు జంటలు రొమాన్స్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. చుట్టూ జనాలు ఉన్నారనే కనీస గ్నానం లేకుండా దారుణంగా ప్రవర్తించారు. ముద్దులతో రెచ్చిపోయారు. ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత మెట్రో అధికారులు ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు కూడా. తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ సారి మెట్రోలో కాదు. కానీ ఇది కూడా ఢిల్లీలోనే జరగడం గమనార్హం.

ఢిల్లీ నడి వీధుల్లో ఓ జంట స్కూటర్ పై వెళుతూ రొమాన్స్ చేశారు. నడి రోడ్డుపై స్కూటర్ పై వెళ్తునప్పుడు ఒకరినొకరు కౌగిలించుకుంటూ దారుణంగా ప్రవర్తించారు. దీనిని రోడ్డుపై వెళ్తున్న మరికొందరు వీడియో తీసి షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి 6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.


ఒక వ్యక్తి స్కూటర్‌పై వెళుతుండగా, ఒక మహిళ వెనక కూర్చున్నట్లు వీడియోలో కనపడింది. మహిళ వెనుక నుండి ఆ వ్యక్తిని కౌగిలించుకుంది. అతను కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. రద్దీగా ఉండే రోడ్డుపై స్కూటర్‌పై  వెళుతూ వీరు ఈ కౌగిలింతల పర్వం కొనసాగించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?