Kareena Kapoor’s Dance at Karachi Party: పాకిస్తాన్‌లో జరిగిన రేవ్ పార్టీలో కరీనా కపూర్ కనిపించారు. ఎవరో ఈ బాలీవుడ్ బ్యూటీని పాక్ పార్టీకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అది వారు ఊహించినంత గ్లామ్‌గా జరగలేదు. కరాచీ పార్టీ నుండి ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో కరీనా పెద్ద స్క్రీన్‌పై బిగ్గరగా వస్తున్న మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే, ఇది రియల్ గా కాదు.. ఆమెకు సరిపోలని పేలవమైన యానిమేషన్ అవతార్. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
Kareena Kapoor’s Dance at Karachi Party: పాకిస్తాన్‌లో జరిగిన ఒక నైట్ క్లబ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ డాన్స్ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే, ఆమె రియాల్ గా ఆ పార్టీలో పాల్గొనలేదు. ఆమె యానిమేషన్ అవతార్‌ను పెద్ద స్క్రీన్ పై చూపించారు. బిగ్గరగా పెట్టిన డీజే సౌండ్ కు కరీనా కపూర్ యానిమేషన్ అవతార్ డాన్స్ చేస్తున్నట్టుగా సంబంధిత వీడియోలలో కనిపిస్తోంది.
ఈ యానిమేషన్ వీడియోను ఏఐ సాయంతో రూపొందించారు. డీజే హంజా హారిస్ కరీనా కపూర్ యానిమేషన్ వీడియోను ఏఐ సాయంతో చేయగా, దీనిని సోషల్ మీడియాలో మీరు పాకిస్తాన్ లోని కరాచీ పార్టీలో ఉన్నారు. మీ ముందు బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ డాన్స్ చేస్తున్నారు అంటూ క్యాప్షన్ తో షేర్ చేశారు.
ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కరీనా కపూర్ అలా పాక్ పార్టీలో ఎందుకు డాన్స్ చేయాలంటూ ప్రశ్నించే వారితో పాటు ఇది చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేసే వారు కూడా ఉన్నారు. ఇదే సమయంలో ఏఐ కారణంగా ఇతర వ్యక్తుల ఫోటోలను ఉపయోగించి ఇలా వీడియోలు, ఫోటోలు సృష్టించడం పై ఆందోళనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ మీడియో పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి.