
ముంబై : భారత్ లో రైల్వే ఫుడ్ అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే. అందుకే వీలైనంత వరకు ఈ ఆహారానికి దూరంగా ఉంటారు. సమీప ప్రాంతాలనుంచి రైళ్లలోకి తెచ్చిచ్చే ఫుడ్ యాప్స్ ను ఆశ్రయిస్తుంటారు. తెలిసి తెలిసీ.. రైల్వే ఫుడ్ ను మాత్రం తినడానికి ఇష్టపడరు. అయితే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈ అపోహను దూరం చేయాలని కంకణం కట్టుకుంది. రైల్వే ప్రయాణీకులకు మంచి రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
టాప్-క్లాస్ సీటింగ్, ఇతర సౌకర్యాలతో పాటు, మంచి నాణ్యమైన ఆహారం ఈ ప్రీమియం రైళ్ల సౌకర్యాల్లో ఒకటిగా చేర్చారు. అయితే, రైళ్లలో ఆహార ఇబ్బందులు, ఖరీదైన వందేభారత్ ట్రైన్ లను కూడా వదలడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 10న ముంబై-షిర్డీ వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన రెండు రోజుల తర్వాత, వీరేష్ నార్కర్ అనే ట్విట్టర్ యూజర్ "అద్భుతమైన" ఈ రైలులో తన అనుభవం అంటూ.. ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. తన పోస్ట్‌లో, అతను రైల్వే అధికారులను ట్యాగ్ చేసి, "డస్టీ కార్న్ ఫ్లేక్స్" అందిస్తున్నారని విమర్శించారు.
ప్రాణం తీసిన పందెం.. పది నిమిషాల్లో మూడు క్వార్టర్లు ఖాళీ.. ఓవర్ డోస్ అవ్వడంతో...
దీంతో పాటు కామెంట్ లో ఓ వ్యంగ్య వ్యాఖ్యానం కూడా పోస్ట్ చేశాడు. "ప్రియమైన వందేభారత్ ట్రైన్ బృందం, బయట పొగ ఉంది. దాని వల్ల ఏసీ హోల్స్ నుంచి చిన్న చిన్న పొగ రేణువులు వచ్చి పాలపై పేరుకుపోయాయని నేను అనుకుంటున్నాను. పాలు, కార్న్‌ఫ్లేక్‌లకు ప్రత్యామ్నాయాలు దయచేసి ఆలోచించండి. అలా అయినా ఆహార నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను.’’ అంటూ రాశారు.
ట్విట్టర్ వినియోగదారు వందేభారత్ ట్రైన్లో మెరుగైన శుభ్రత, ప్రైవసీ గురించి కూడా మరికొన్ని సూచనలను చేశారు. ఇతర వినియోగదారులు ఆన్‌బోర్డ్‌లో ఇలాంటి అనుభవాలను ఎలా పొందారనే దాని గురించి వ్యాఖ్యానించారు. భారతీయ రైల్వేలు నార్కర్ ఫిర్యాదును గంటలోపే పరిగణనలోకి తీసుకుంది. అతని ఫిర్యాదుకు వారు.. మీ ఫిర్యాదు రైల్‌మదాద్‌లో నమోదు చేయబడింది. ఫిర్యాదు నెం. మీ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా పంపుతాం. మీరు ఈ లింక్ ద్వారా మీ ఫిర్యాదును ట్రాక్ చేయవచ్చు అని సమాధానమిచ్చారు.
ఒరిజినల్ ట్వీట్‌కి ఇప్పటివరకు 9వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఫిబ్రవరి 12న, ఐఆర్ సిటిసీ ఫుడ్‌పై ఫిర్యాదు చేస్తూ మరో ట్వీట్ కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.