శ్రీరామ నవమి రోజున బెంగాల్‌లో అల్లర్లు.. రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు.. వాహనాలకు నిప్పు

By Mahesh KFirst Published Mar 30, 2023, 8:31 PM IST
Highlights

శ్రీరామ నవమి వేడుకలు జరుగుతుండగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ మూకలు అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. హౌరాలో రామ నవమి ఊరేగింపు జరిగిన ఈ ఘర్షణలు జరిగాయి.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతుండగా.. హౌరాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హౌరా గుండా శ్రీరామ నవమి ఊరేగింపు వెళ్లిన తర్వాత అక్కడ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. వాహనాలకు నిప్పులు పెట్టడంతో పలు వాహనాలు కాలిపోతూ కనిపించాయి. అనంతరం, ఆ ఏరియాలో పోలీసు బలగాలు పెద్ద మొత్తంలో మోహరించాయి. రయట్ కంట్రోల్ ఫోర్స్ కూడా మోహరించింది. అక్కడే కనిపించిన పోలీసు వ్యాన్, కారు వాహనాలూ ధ్వంసమైన స్థితిలో కనిపించాయి. ఆ పోలీసు వాహనాల గ్లాసులు పగిలిపోయాయి. 

అల్లర్ల విషయం తెలియగానే పోలీసులు స్పాట్‌కు వచ్చారు. పోలీసులు ఆ దుండగులపై భాష్ప వాయు గోళాలను ప్రదర్శించాయి. అల్లర్లకు పాల్పడ్డ వారిని వెంబడిస్తూ కొందరు పోలీసులు కనిపించారు.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో రెండు రోజుల ధర్నాకు దిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆమె ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అల్లర్లపై మాట్లాడుతూ, అల్లర్లకు పాల్పడేవారు దేశానికి శత్రువులు అని తెలిపారు.

Also Read: కరోనా వైరస్ బులెటిన్.. మహారాష్ట్రలో 63 శాతం పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే 694 కొత్త కేసులు

శ్రీరామ నవమి సందర్భంగా ఊరేగింపు తీసేవారందరికీ తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నట్టు మమతా బెనర్జీ ఈ రోజు ఉదయం అన్నారు. ఆ ఊరేగింపు శాంతి యుతంగా చేపట్టాలని వివరించారు. శ్రీరామ నవమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, హింసకు పాల్పడవద్దని పేర్కొన్నారు. రెచ్చగొట్టే పనులు చేయవద్దని, ఎవరైనా అలా వ్యవహరించినా.. ఘర్షణలకు దిగొద్దని సూచనలు చేశారు.

శ్రీరామ నవమి వేడుకల రోజునే టీఎంసీ ధర్నాను ప్రకటించడంపై బీజేపీ విమర్శలు చేసింది. సనాతన సంస్కృతిని విశ్వసిం చేవారు రాముడి జయంతిని వేడుకలు చేసుకుంటారని బీజేపీ నేత సువేందు అధికారి తెలిపారు. సెలవు ప్రకటించ కుండా ధర్నాకు ప్రకటించారని విమర్శించారు.

click me!