మహారాష్ట్రలో 63 శాతం పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే 694 కొత్త కేసులు

Published : Mar 30, 2023, 07:37 PM IST
మహారాష్ట్రలో 63 శాతం పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే 694 కొత్త కేసులు

సారాంశం

మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా కరోనా కేసులు 63 శాతం పెరిగాయి. ఈ రోజే 694 కొత్త కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు మూడు వేలకు పెరిగాయి.  

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజే కొత్త కేసుల్లో 63 శాతం పెరుగుదల కనిపించింది. ఈ రోజు మహారాష్ట్రలో 694 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 483 కొత్త కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ రోజు కరోనా మరణాలేవీ లేవు. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య  3,016కు పెరిగాయి. చివరి సారి ఇంత భారీగా కేసులు అక్టోబర్ 27న (972) రిపోర్ట్ అయ్యాయి.

నాలుగు వారాల క్రితం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉన్నది. అదే మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య ఇది 6.15 శాతానికి పెరిగింది. ప్రతి 100 టెస్టులకు పాజిటివ్ కేసుల సంఖ్యనే పాజిటివిటీ రేటుగా గణిస్తారు.

మహారాష్ట్రలో అధికంగా కేసులు ముంబయి, పూణె, థానే, రాయ్‌గడ్, నాసిక్, సాంగ్లీ జిల్లాల్లో నమోదవుతున్నాయి.

Also Read: పెరుగు వివాదం: ప్యాకెట్ పై ‘దహి’ ప్రింట్ చేయాలన్న ఆదేశాలపై విమర్శలు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఉపసంహరణ

కేసులు పెరుగుతున్న తరుణంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలను ప్రకటించింది. ప్రజలు ఒక చోట గుమిగూడొద్దని సూచించింది. మాస్కులు ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని వివరించింది.

PREV
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu