మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు..

Published : Aug 05, 2023, 11:39 AM IST
మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు..

సారాంశం

మణిపూర్ లో మళ్లీ హింసాత్మక ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండుగులు నిరాయుధులైన ముగ్గురిని కాల్చి చంపారు. ఇందులో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ ఘటన బిష్ణుపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన తాజా హింసాకాండలో తండ్రీకొడుకులు సహా ముగ్గురు చనిపోయారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బిష్ణుపూర్ లోని క్వాక్తా సమీపంలోని ఉఖా తంపాక్ గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్‌ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..

ఈ ఘటనలో ఇద్దరు తండ్రీకొడుకులు, వారి పక్కింట్లో నివసించే మరో వ్యక్తిని దుండగులు హతమార్చారు. నిద్రిస్తున్న ముగ్గురిని కాల్చి చంపారని, అనంతరం కత్తులతో నరికారు. దుండగులు చురాచంద్ పూర్ నుంచి వచ్చారని పోలీసులు శనివారం ఉదయం తెలిపారు. కేంద్ర భద్రతా బలగాలు మోహరించిన కొండలు, లోయల మధ్య బఫర్ జోన్ ను దుండగులు ఛేదించగలిగారని పేర్కొన్నారు.

ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి.. కాశ్మీర్ లోని కుల్గాంలో ఘటన..

కాగా.. అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఉమ్మడి బలగాలు రాష్ట్రంలోని సున్నితమైన, అంచు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయని, ఏడు అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని మణిపూర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. బిష్ణుపూర్ లోని తెరఖోంగ్ సంగ్బీ వద్ద గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని ముష్కరులు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 35 ఏళ్ల అరిబమ్ వహీదా బీబీ అనే మహిళ చేతికి బుల్లెట్ గాయమైంది. ఆమె ప్రస్తుతం ఇంఫాల్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

మొదలైన ఆర్టీసీ బస్సు సర్వీసులు.. ముగిసిన కార్మికుల నిరసన..

కాగా..  మే 3వ తేదీ నాటి నుంచి చెలరేగిన అల్లర్లలో 160 మందికి పైగా మరణించారు.  ఇళ్లు, దుకాణాలు, వాహనాలతో సహా పెద్ద సంఖ్యలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీటీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' నిర్వహించిన తరువాత మణిపూర్ లో జాతి ఘర్షణలు చెలరేగాయి. దీనిపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..