
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి దక్షిణాఫ్రికా నుంచి రెండో బ్యాచ్ చిరుతలు త్వరలో రానున్నాయి. ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. 12 చిరుతలతో కూడిన రెండో విడత ఫిబ్రవరి 18న ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని సీనియర్ అటవీ అధికారి శనివారం తెలిపారు. ఈ నేషనల్ పార్క్‌లో ఇటీవల ఎనిమిది చిరుతలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై చీఫ్ కన్జర్వేటర్ వైల్డ్ లైఫ్ జెఎస్ చౌహాన్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుండి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)కి 12 చిరుతలతో కూడిన రెండవ బ్యాచ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెప్టెంబరు 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలతో కూడిన తొలి బ్యాచ్‌ను కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నెల రోజుల పాటు క్వారంటైన్‌లో..
ఈ చిరుతలను కునో నేషనల్ పార్క్‌కు తరలించే ముందు దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్‌కు తీసుకువెళతామని జెఎస్ చౌహాన్ తెలియజేశారు. అందులో మగ, ఆడ ఎంతమంది ఉంటారన్న సమాచారం తన వద్ద లేదని చెప్పినప్పటికీ. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకారం, చిరుతలను దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన తరువాత, నిబంధనల ప్రకారం, వాటిని ఒక నెల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారని తెలిపారు. అయితే.. ఏడీజీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) SP యాదవ్ ఇంకా తేదీని నిర్ణయించడానికి నిరాకరించారు.
ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా తొలి బ్యాచ్‌ను విడుదల
సెప్టెంబరు 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలతో కూడిన మొదటి బ్యాచ్‌ను ఐదు ఆడ, మూడు మగ చిరుతలను కేఎన్‌పీలోని ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. భారత్‌లో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత చిరుత జాతులు అంతరించిపోయిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీ, ప్రిటోరియా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిన తర్వాత, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది.