వికాస్ దూబే కోసం గాలింపు: ఇద్దరు ముఖ్య అనుచరులు హతం

By telugu teamFirst Published Jul 9, 2020, 8:46 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరులు ఇద్దరు హతమయ్యారు. పోలీసులు వికాస్ దూబే కోసం గాలిస్తున్నారు. ఎన్ కౌంటర్ ప్రభాత్ మిశ్రా అనే ముఖ్య అనుచరుడు హతమయ్యాడు.

లక్నో: ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగస్టర్ వికాస్ దూబే కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసుల చేతుల్లో హతమయ్యారు. 

వికాస్ దూబే ముఖ్య అనుచరుడైన ప్రవీణ్ అలియా బౌవా దూబే గురువారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. అతనిపై 50 వేల రూపాయల రివార్డు ఉంది. జూలై 3వ తేదీన జరిగిన ఎదురకాల్పుల్లో 8 మందిని చంపిన కేసులో అతను నిందితుడు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ప్రత్యేక టాస్క్ పోలీసులు సంయుక్తంగా ఇటావా సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బౌవాను కాల్చి చంపారు. 

Also Read: వికాస్ దూబే తలపై రివార్డు పెంచిన యోగి సర్కార్

స్కార్పియోలో వచ్చిన నలుగురు సాయుధ దుండగులు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బకేవార్ పీఎస్ పరిధిలోని మహేవా వద్ద జాతీయ రహదారిపై స్విఫ్ట్ డిజైర్ కారును దోపిడీ చేసారని, ఆ కారును సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలోని కచౌరా రోడ్డుపై పోలీసులు చేజ్ చేశారని, దాంతో స్విఫ్ట్ డిజైర్ ఓ చెట్టును ఢీకొట్టిందని, వెంటనే దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారని ఇట్టావా ఎస్ఎస్పీ ఆకాశ్ తోమర్ చెప్పారు. 

ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఎదురుకాల్పుల్లో తీవ్రమైన గాయాలు అయ్యాయని, ఆస్పత్రికి చేర్చేలోగానే అతను మరణించాడని, సంఘటన స్థలం నుంచి ఓ పిస్టల్ ను, ఓ డబుల్ బ్యారెల్ గన్ ను, పలు కాట్రిడ్జెస్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

Also Read: ఢిల్లీలో ప్రవేశానికి వికాస్ దూబే మాష్టర్ ప్లాన్

ఇదిలావుంటే, కాన్పూర్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచురుడు ప్రభాత్ మిశ్రా హతమయ్యాడు. బుధవారంనాడు ప్రభాత్ మిశ్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ట్రాన్సిట్ రిమాండ్ పై అతన్ని ఉత్తరప్రదేశ్ కు తీసుకుని వచ్చారు. విచారణ జరుపుతున్న సమయంలో అతను పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ప్రభాత్ మిశ్రా మరణించాడని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు ప్రభాత్ మిశ్రాను తీసుకుని వస్తుండగా పంకీ సమీపంలో వాహనం టైర్ పంక్చర్ అయిందని, ప్రభాత్ మిశ్రా ఓ పోలీసు నుంచి పిస్టల్ ను లాక్కుని కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ పోలీసులు గాయపడ్డారని అంటున్నారు. 

click me!