రక్తస్రావం, షాక్‌తోనే దూబే మృతి: పోస్టుమార్టం నివేదిక

By narsimha lodeFirst Published Jul 20, 2020, 2:38 PM IST
Highlights

పోలీసు కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో షాక్‌కు గురై గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే మరణించాడని పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఈ నెల 10వ తేదీన  కాన్పూరుకు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో  వికాస్ దూబే మరణించాడు. 


న్యూఢిల్లీ: పోలీసు కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో షాక్‌కు గురై గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే మరణించాడని పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఈ నెల 10వ తేదీన  కాన్పూరుకు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో  వికాస్ దూబే మరణించాడు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని దేవాలయంలో దూబే ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుండి కాన్పూరుకు వాహనంలో తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో పోలీసుల  నుండి తుపాకీని లాక్కొని తప్పించుకొనే ప్రయత్నంలో కాల్పులు చోటు చేసుకొన్నాయని పోలీసులు చెప్పారు.ఈ క్రమంలోనే దూబేపై జరిపిన కాల్పుల్లో ఆయన మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.

also read:తెలంగాణ లాంటి కాదు, నిజమైందే: వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకు యూపీ పోలీసులు

వికాస్ దూబే శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక తెలిపింది. మృతుడి శరీరంపై పది గాయాలు ఉన్నట్టుగా రిపోర్టు చెబుతోంది. వికాస్ దూబే కుడి భుజానికి రెండు బుల్లెట్లు, ఛాతీ ఎడమవైపు చొచ్చుకువెళ్లాయని నివేదిక వెల్లడించింది. దుబే తల, మోచేయి, కడుపు భాగంలోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది.

మహంకాళి దేవాలయంలో పూజలు చేసేందుకు ఉజ్జయిని వచ్చిన దుబేను ఈనెల 9న మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్పూర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్‌ దుబే ప్రధాన నిందితుడు. 

click me!