
తమిళ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కొంత కాలంగా వస్తున్న వార్తలను ఆయన నిజం చేశారు. విజయ్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. దానికి ‘తమిజగ వెట్రి కజగం’ అనే పేరు పెట్టారు. ఆ పేరును తాజాగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ లో తాజాగా రిజిస్ట్రేషన్ చేయించారు.
బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ప్రత్యేక దేశం అవసరం - కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
దీంతో రాజకీయ అరగేంట్రం చేయబోతున్నానని విజయ్ దళపతి అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది. విజయ్ దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసింది.
బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ గోడం నగేష్..?
డిసెంబర్ వరదలతో అతలాకుతలమైన తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో పర్యటించి బాధితులకు సహాయ సామాగ్రిని అందించారు. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత సినిమాల్లో నటించడం మానేసి.. పూర్తిగా రాజకీయాలపైనే ఫొకస్ పెట్టాలని భావిస్తున్నారు.