విధుల్లో చేరిన అభినందన్‌: భావోద్వేగానికి గురైన సహచరులు

Published : May 05, 2019, 03:21 PM IST
విధుల్లో చేరిన అభినందన్‌: భావోద్వేగానికి గురైన సహచరులు

సారాంశం

ఇండియన్ ఎయిర్‌పోర్స్ వింగ్ కమాండర్ అభినందన్  తిరిగి విధుల్లో చేరారు. పాక్ జెట్ ఫైటర్‌ను కూల్చి వేసి ఆపై శత్రు సైన్యానికి పట్టుబడినా అపారమైన గుండె నిబ్బరంతో  అభినందన్  ఉన్నాడు. 


న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌పోర్స్ వింగ్ కమాండర్ అభినందన్  తిరిగి విధుల్లో చేరారు. పాక్ జెట్ ఫైటర్‌ను కూల్చి వేసి ఆపై శత్రు సైన్యానికి పట్టుబడినా అపారమైన గుండె నిబ్బరంతో  అభినందన్  ఉన్నాడు. 

దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను మాత్రం అభినందన్ బయటపెట్టలేదు.  పాక్ నుండి  ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.  ఈ వైద్య పరీక్షలు నిర్వహించిన అభినందన్ ఫిట్‌గా తేలింది. దీంతో అభినందన్ ‌తిరిగి విధుల్లో చేరారు.

ఈ క్రమంలోనే అభినందన్‌ జమ్మూ కాశ్మీర్‌లో తాను పనిచేస్తున్న ఎయిర్ బేస్‌కు రాగా, సహోద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. అభినందన్‌ను సహోద్యోగులు చుట్టు చేరి అభినందించారు. ఆయనతో సెల్ఫీలు దిగారు.

అభినందన్ కూడా చాలా రోజుల తర్వాత తన సహచరులను చూసి భావోద్వేగాలకు లోనయ్యారు. వారితో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా అక్కడ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu