పూరీలో 21కి చేరిన మృతుల సంఖ్య, అంధకారంలోనే భువనేశ్వర్

By Siva KodatiFirst Published May 5, 2019, 1:41 PM IST
Highlights

బంగాళాఖాతంలో సంభవించిన ఫణి తుఫాను కారణంగా పూరీ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 21కి చేరినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శనివారం నాటికి పూరి, నయాగఢ్, కేంద్రపడ, బరిపద, కేంఝర్‌లో కలిపి 13 మంది మరణించారు.

తుఫాను ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుండటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు భారీ వర్షాలతో తీర ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అనేక జిల్లాల్లో భారీ ఆస్తినష్టం సంభవించింది. లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, టవర్లు కూలడంతో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఫణి తుఫాను నేపథ్యంలో శనివారం ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను బాధితులకు 15 రోజుల వరకు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఆదివారం జరగాల్సిన నీట్ పరీక్షను తుఫాను ప్రభావానికి ఒడిశాలో రద్దు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్రమోడీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

click me!