ఎంతకీ తెగించార్రా : ఇన్‌స్టా రీల్ కోసం.. ఏకంగా పోలీస్ జీప్‌పై డ్యాన్స్, యూపీలో కలకలం

Siva Kodati |  
Published : May 21, 2023, 04:14 PM IST
ఎంతకీ తెగించార్రా : ఇన్‌స్టా రీల్ కోసం.. ఏకంగా పోలీస్ జీప్‌పై డ్యాన్స్, యూపీలో కలకలం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చోడంతో పాటు డ్యాన్స్ చేశారు. పోలీసులు చెబుతున్న దానిని బట్టి.. ఆ జీప్‌ను సర్వీసింగ్ కోసం దగ్గరలోని గ్యారేజ్‌కి పంపారు. ఇదే అదనుగా ఆ యువకులు ఇన్‌స్టా రీల్స్ కోసం ఆ జీపును ఉపయోగించుకున్నారు. 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు వారిపై చర్యలకు దిగారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోను బట్టి.. ఇద్దరు యువకులు పోలీస్ జీప్ బానెట్‌పై కూర్చున్నారు. ఇద్దరూ పోలీస్ జీప్ ముందు పోర్షన్ ఎక్కుతూ కాళ్లను అడ్డంగా పెట్టి కెమెరా లెన్స్‌లకు పోజులివ్వడం కనిపించింది. ఈ ఘటన కాన్పూర్‌లోని బజారియా ప్రాంతంలో రికార్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. సదరు జీపు స్థానిక పోలీస్ స్టేషన్‌కి చెందినదిగా తెలుస్తోంది. కింగ్ అనే క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను షేర్ చేశారు. బానెట్‌పై కూర్చొన్న ఇద్దరు యువకుల్లో ఒకరు ఓ కేసులో నిందితుడి సోదరుడిగా గుర్తించారు. అయితే ఆ రెండో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. 

పోలీసులు చెబుతున్న దానిని బట్టి.. ఆ జీప్‌ను సర్వీసింగ్ కోసం దగ్గరలోని గ్యారేజ్‌కి పంపారు. అక్కడ ఈ యువకులు ఉద్దేశపూర్వకంగా వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న వాహనం నెంబర్ ప్లేట్ కాన్పూర్ దేహత్‌లోని అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ పేరిట రిజిస్టర్ అయ్యిందని చెబుతున్నారు. ఏసీపీ సిసామావు మాట్లాడుతూ.. ఇద్దరు యువకులు పోలీస్ జీపు బానెట్‌పై తీసిన వీడియో వైరల్ అవుతోంది. జీపు రిపేర్ కోసం వెళ్లిన సమయంలోనే ఈ యువకుడు వీడియో తీశారని విచారణలో తేలిందన్నారు. వారిద్దరిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం