బహిరంగ సభలో మ‌హిళా నాయకురాలిని ముద్దాడిన‌ సేన ఎమ్మెల్యే..! వీడియో వైరల్‌.. ఇద్ద‌రు నిందితుల అరెస్ట్

By Rajesh KarampooriFirst Published Mar 13, 2023, 4:54 AM IST
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, మహిళా నేతల అభ్యంతరకర వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. అయితే.. ఆ వీడియో ను అభ్యంతరకర ఎడిట్ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో వీడియోను క్రాప్ చేసి వైరల్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్రలోని దహిసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

మహారాష్ట్రలోని ముంబై నుంచి వెలువడిన ఓ వీడియో రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, మహిళా నేతల అభ్యంతరకర వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఆ వీడియో శివసేన నాయకురాలు శీతల్ మ్హత్రేను సర్వే ముద్దుపెట్టుకున్నట్టు, ఆమె వైపు చూస్తూ నవ్వడం, ఆ మహిళ నేతతో ఎమ్మెల్యే చనువుగా వ్యవహరించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

దీంతో సదరు ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై శివ సేన కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరలయిన వీడియో నకిలీదని తేల్చారు. ఎమ్మెల్యే పరువు తీసేందుకు, ఎడిట్ చేసి వైరల్ చేసినందుకు  ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. 
 
సమాచారం ప్రకారం.. శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే (షిండే వర్గం), ఒక మహిళా నాయకురాలి వీడియోను అభ్యంతరకర ఎడిట్ చేసి ఇంటర్నెట్‌లో వైరల్ చేసినందుకు దహిసర్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 354, 509, 500, 34, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాను అరెస్టు చేశారు.మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ర్యాలీకి శివసేన అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే, ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే హాజరయ్యారు. ఈ ర్యాలీకి సంబంధించిన శీతల్ మ్హత్రే , ప్రకాష్ సర్వేల వీడియో అభ్యంతకరంగా ఎడిట్ చేయబడ్డాయి. అసభ్యకరమైన కామెంట్స్ తో వైరల్ చేయబడ్డాయి. ఈ వైరల్ వీడియోపై సమాచారం అందుకున్న శివసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసైనికులు వెంటనే దహిసర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

ఈ వీడియో వ్యవహారంపై శివసేన అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.వీడియో ఎడిట్ చేసిన వ్యక్తులపై విరుచుకుపడ్డారు. మహిళ నేత వ్యక్తిత్వాన్ని అవమానించారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో “రాజకీయాల్లో ఒక మహిళ నాయకురాలిని కించపరిచేలా.. ప్రవర్తిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ సంస్కృతి అని ప్రశ్నించారు.

click me!