రోడ్డుపై అత్తను ఈడ్చుకెళ్లిన కోడలు... వైరల్ (వీడియో)

Published : Jun 09, 2018, 11:15 AM IST
రోడ్డుపై అత్తను ఈడ్చుకెళ్లిన కోడలు... వైరల్ (వీడియో)

సారాంశం

వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిన ఓ ఘటన ఓడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. కోడలే మానవత్వాన్ని మరచి 75 ఏళ్ల అత్తను రోడ్డుపై ఈడ్చుకువెళ్లిన దారుణ ఘటన ఓడిశా రాష్ట్రంలోని బర్గాడ్ జిల్లా తాళపల్లి గ్రామంలో జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో భూవివాదం వల్ల అత్తను కోడలు అత్యంత దారుణంగా రోడ్డుపై ఈడ్చుకువచ్చిందని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితురాలైన బాలామతిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

 

PREV
click me!

Recommended Stories

Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి