చెన్నై ఎంజీఎం ఆసుపత్రికి ఉపరాష్ట్రపతి ఫోన్: బాలు ఆరోగ్యంపై ఆరా

By Siva KodatiFirst Published Sep 24, 2020, 11:18 PM IST
Highlights

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించడంతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. వెంటనే బాలు చికిత్స పొందుతున్న చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలతో ఉప రాష్ట్రపతి మాట్లాడి తాజా పరిస్ధితిపై ఆరా తీశారు

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించడంతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. వెంటనే బాలు చికిత్స పొందుతున్న చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలతో ఉప రాష్ట్రపతి మాట్లాడి తాజా పరిస్ధితిపై ఆరా తీశారు.

ఎస్పీబీ ఆరోగ్యం విషమంగా ఉందని, తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వైద్యులు వెంకయ్యకి తెలియజేశారు. అవసరమైతే ఇతర వైద్య నిపుణులను సంప్రదించాలని వైద్యులకు సూచించారు ఉప రాష్ట్రపతి.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్ధితి విషమిస్తుండటంతో ఆయన కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ ఎంజీఎంకు చేరుకుని బాలు ఆరోగ్య పరిస్ధితి గురించి ఆరా తీశారు.

Also Read:ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితి విషమం: ఆసుపత్రికి చేరుకున్న కమల్ హాసన్

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఎస్పీ బాలసుబ్రమణ్యం కండీషన్ విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లుగా తెలిపారు.  సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సైతం ఇదే చెప్పారు. నిన్న కూడా ఆయన బాగానే ఉన్నారని.. జ్యూస్ తాగారని కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఎక్మో, వెంటిలేటర్ ఇతర ప్రాణాధార చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 

click me!