వ్యవసాయ బిల్లుల ఆమోదం: పంజాబ్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళన

By narsimha lodeFirst Published Sep 24, 2020, 6:04 PM IST
Highlights

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్ రైతాంగం ఆందోళనకు దిగింది. ఈ నెల 25న పంజాబ్ రాష్ట్రంలో బంద్ కు 31 రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.


న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పంజాబ్ రైతాంగం ఆందోళనకు దిగింది. ఈ నెల 25న పంజాబ్ రాష్ట్రంలో బంద్ కు 31 రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

పంజాబ్ రాష్ట్రంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో ఈ బిల్లులకు ఆమోదం లభించింది.ఈ బిల్లులు ఆమోదం పొందడంపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.

వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో అమృత్ సర్ లో రైతులు రైలు రోకోలు నిర్వహించారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకోవాలని రైతు సంఘాలు కోరాయి.

వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా ఓటు చేసిన వారిని బాయ్ కాట్ చేయాలని రైతులు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.సెప్టెంబర్ 25న కొందరు, అక్టోబర్ 1న బంద్ కు పిలుపునిచ్చారు.రేపటి నిరసనల దృష్ట్యా పిరోజ్ పూర్ రైల్వే డివిజన్ ముంబైతో పంజాబ్ రాష్ట్రం గుండా వెళ్లే 14 రైళ్లను రద్దు చేశారు. 

ఈ బిల్లులతో రైతులకు నష్టం జరుగుతోందని రైతు సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పోరేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తోందని పంజాబ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందడంతో  మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి,  ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రైతులు రైల్వేట్రాక్ లపై నిలబడి నిరసనకు దిగారు.

ఈ బిల్లులను తాము వ్యతిరేకిస్తున్నామని రైతులు ప్రకటించారు.  ఈ బిల్లుల నుండి వెనక్కి తగ్గేవరకు తాము పోరాటం చేస్తామని రైతులు ప్రకటించారు.దేశంలోని ఏ రైతు కూడ ఈ బిల్లులకు మద్దతు ప్రకటించరని రైతులు చెబుతున్నారు.


 

click me!