బెంగళూరు అల్లర్ల కేసు: ఎన్ఐఏ అదుపులో నిందితుడు

By Siva KodatiFirst Published Sep 24, 2020, 9:13 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలో సంచలన సృష్టించిన అల్లర్ల కేసులో సయ్యద్ సాదిఖ్ అలీ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. నాటి ఘటనలో హింసకు దారి తీసిన దాడికి కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుంది

కర్ణాటక రాష్ట్రంలో సంచలన సృష్టించిన అల్లర్ల కేసులో సయ్యద్ సాదిఖ్ అలీ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. నాటి ఘటనలో హింసకు దారి తీసిన దాడికి కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుంది.

కాగా సోషల్ మీడియాలో కలకలం రేపిన ఓ పోస్ట్ కారణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై అల్లరి మూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎ

మ్మెల్యే నివాసం ఎదుట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటుగా, పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో డీజే హళ్లీ, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్‌లపై దాడి చేసిన అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపడంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 21న ఎన్ఐఏ రంగంలోకి దిగింది.

ఈ క్రమంలో గురువారం 30 చోట్లు సోదాలు నిర్వహించింది. దీనిలో భాగంగా ఎయిర్‌గన్, పదునైన ఆయుధాలతో పాటు ఐరన్ రాడ్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఓ బ్యాంక్‌లో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న సయ్యద్ సాదిఖ్ ఆగస్టు 11 ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడంతో ఈరోజు అతనిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.  
a

click me!