కరుణానిధిని పరామర్శించిన వెంకయ్య.. భారీగా చేరుకుంటున్న డీఎంకే కార్యకర్తలు

First Published Jul 29, 2018, 3:26 PM IST
Highlights

జ్వరం, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు

జ్వరం, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక  విమానంలో చెన్నై చేరుకున్న ఉపరాష్ట్రపతి నేరుగా కావేరి ఆసుపత్రికి చేరుకుని కరుణను పరమర్శించి.. వైద్యులను అందిస్తున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను ఓదార్చారు.

మరోవైపు కలైంజర్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఎండీఎంకే చీఫ్ వైగోను కావేరి ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. హాస్పిటల్‌ లోపల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉండటంతో భద్రతా కారణాల రీత్యా లోపలికి ఎవరిని అనుమతించబోమని వారు వైగోకి తెలిపారు. కరుణానిధిని పరామర్శించేందుకు రాష్ట్ర, జాతీయస్థాయి నేతలు కావేరి ఆసుపత్రికి క్యూకట్టారు.

రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌,తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌, కాంగ్రెస్‌ నేత గులాంనబీఆజాద్‌, పాండిచ్చేరి మాజీ సిఎం రంగస్వామి, ఆర్‌కె నగర్‌ ఎమ్మెల్యే దినకరన్‌, నడిగర్‌ సంఘం అధ్యక్షులు నాజర్‌, సినీనటుడు ప్రభు తదితరులు కరుణానిధిని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ డీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు.
 

click me!