దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి...తృటిలో తప్పించుకున్న దినకరన్

Published : Jul 29, 2018, 01:36 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి...తృటిలో తప్పించుకున్న దినకరన్

సారాంశం

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత.. ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. చెన్నై అడయార్‌లోని దినకరన్ ఇంటి వద్ద ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు విసిరారు. 

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత.. ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. చెన్నై అడయార్‌లోని దినకరన్ ఇంటి వద్ద ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ సమయంలో ఆయన ఇంట్లో ఉండటంతో ప్రమాదం తప్పింది..

అయితే కారు డ్రైవర్, వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గాయపడ్డారు. దినకరన్‌పై దాడి విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కార్యకర్తలు భారీగా దినకరన్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం