సీనియర్ నటి వాణిశ్రీ స్థలం కబ్జా.. 11యేళ్ల తరువాత తిరిగి అప్పగించిన సీఎం..

By SumaBala BukkaFirst Published Sep 29, 2022, 7:21 AM IST
Highlights

పాతతరం నటి వాణిశ్రీకి ఊరట లభించింది. పదకొండేళ్ల కిందట కబ్జాకు గురైన ఆమె స్థలాన్ని తమిళనాడు ప్రభుత్వం తిరిగి ఆమెకు అప్పగించింది. 

తమిళనాడు : ప్రముఖ సీనియర్ నటి వాణిశ్రీకి చెందిన ఇరవై కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైంది. దీనిని పదకొండేళ్ల తరువాత తమిళనాడు ప్రభుత్వం విడిపించింది. నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు కల్పిస్తూ 20021 సెప్టెంబర్లో తమిళనాడు శాసనసభలో తీర్మానం ఆమోదించారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం నటి వాణిశ్రీ కి చెందిన 20 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించి ఆ పత్రాలను ఆమెకు అందించారు. 

ఇదిలా ఉండగా, 2020లో తెలుగు సినీ నటి వాణిశ్రీకి గర్భశోకం కలిగింది. ఆమె కుమారుడు అభినయ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట అభినయ వెంకటేష్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అభినయ్ వెంకటేష్ ఆ రోజు రాత్రి చెంగల్పట్టు వెళ్లారు. కుమారుడితో సరదాగా గడిపిన తర్వాత ఆయన తిరుక్కలి కుండ్రం ఫాంహౌస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జయంతి పట్నాయక్ కన్నుమూత

బెంగళూరు వెళ్లివచ్చి క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. తిరుక్కలి కుండ్రం పోలీస్ స్టేషన్లో అభినయ్ వెంకటేష్ మృతి పై కేసు నమోదైంది. కాగా, వాణిశ్రీ తెలుగు సినిమాల్లోనే కాకుండా  తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు. 1970 దశకాలలో ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. 1980 దశకంలో తల్లి పాత్రలు వేస్తూ మళ్లీ వెండితెర మీద కనిపించారు.  ఆ తరువాత ఇటీవల నాలుగైదేళ్ల కిందట బుల్లితెరమీద కూడా అరంగేట్రం చేశారు. కానీ ఎందులో అది కంటిన్యూ చేయలేకపోయారు. 

click me!