దసరాకి అంతటా రావణ దహనం...కానీ అక్కడ మాత్రం శూర్పణక దహనం

By Arun Kumar PFirst Published Oct 20, 2018, 4:31 PM IST
Highlights

దసరాను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ పండగ రోజు ఆయుధ పూజ, జమ్మి చెట్టు పూజ చేయడంతో పాటు రావణ దహనం కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.  విజయ దశమి రోజు దేశవ్యాప్తంగా రావణ దహనం చేయడం అనేది అనాదిగా వస్తోంది. అయితే మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో మాత్రం రావణ దహనం కాకుండా అతడి సోదరి శూర్పణక బొమ్మను దహనం చేస్తారు. ఈ వింత దసరా సెలబ్రేషన్స్ గురించి తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

 దసరా పండగ పూట రావణ దహనం కాకుండా శూర్పణక దహనం చేయడం ఆచారం అనుకుంటే మీరు పొరబడినట్లే. వెరైటీ కార్యక్రమం వెనుక మరింత వెరైటీగా ఏర్పడిన ఓ సంఘం ఉంది. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కరోలీ గ్రామంలో కొందరు పెళ్లయిన పురుషులు ''పత్ని పీడిత్ పురుష్ సంఘ్''( భార్యా పీడిత సంఘం) ఏర్పాటు చేసుకున్నారు. తమ భార్యల వల్ల ఎదుర్కొంటున బాధల గురించి సంఘటితంగా పోరాడటానికి ఈ సంఘం ఏర్పడిందన్నమాట.  భార్యల వల్ల భర్తలు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలియజేస్తూ కాస్త వెరైటీకి నిరసన తెలియజేయాలనుకున్నారు ఈ సంఘ సభ్యులు. ఇంకేముందు దసరా పండగ నాడే ఆ వినూత్న నిరసన చేపట్టారు.

దేశవ్యాప్తంగా రావణ దహనం చేపడితే ఈ గ్రామంలో మాత్రం శూర్పణక బొమ్మను దహనం చేశారు. దీంతో ఈ విషయం సామాజి మాధ్యమాల ద్వారా ప్రచారమై దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు మహిళల కోసం, వారి హక్కుల కోసం సంఘాలుండటం చూసినవారు ఇప్పుడు భార్య బాధిత సంఘం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉండటంతో వాటిని అడ్డుపెట్టుకుని తమ భార్యలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఈ సంఘానికి చెందిన ఓ సభ్యుడు వివరించారు. వారి చేతుల్లో నలిగిపోయిన కొందరు భర్తలు కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. తమలాగే భార్యల వల్ల   జీవితాలు నాశనమైన పురుషులంతా కలిసి సంఘటితంగా పోరాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అతడు తెలిపాడు. 

click me!