తోపుడు బండికీ హెల్మెట్? హెల్మెట్ ధరించే బండి తోసుకెళ్లుతున్న కూరగాయల వ్యాపారి.. ఏమన్నాడంటే? (వీడియో)

Published : Oct 11, 2022, 12:54 PM IST
తోపుడు బండికీ హెల్మెట్? హెల్మెట్ ధరించే బండి తోసుకెళ్లుతున్న కూరగాయల వ్యాపారి.. ఏమన్నాడంటే? (వీడియో)

సారాంశం

కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి తన తోపుడు బండిని తోసుకెళ్లుతూ హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎందుకని  అడిగితే.. ముందున్న పోలీసులు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘిస్తే జేబుకు చిల్లు పడుతున్నది. జరిమానాలను పెంచేశారు. దీంతో రోడ్డు పైకి బండి తీస్తున్నామంటే డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయా? లేదా? అని మరోసారి తడిమి చూసుకుంటున్నారు. ఈ ట్రాఫిక్ చలాన్ల భయం చాలా మందిలో ఉన్నది. అయితే, ఈ భయం చాలా మంది అమాయకులపై ప్రభావం వేస్తున్నట్టు తెలుస్తున్నది. దారిలో వెళ్లుతుంటే పోలీసులు ఎక్కడ తమను ఆపేస్తారనో? ఎక్కడ భారీ జరిమానాలు వేస్తారో అనే బెదురు వెంటాడుతున్నది. ఈ భయంతో ఓ తోపుడు బండిపై కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ ధరించే తన తోపుడ బండిని రోడ్డుపై తోసుకుంటూ వెళ్లుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అందులో సదరు వ్యక్తి ఆసక్తికరమైన (అమాయకమైన?) సమాధానాలు విని నెటిజన్లు నుంచి చాలా రకాల స్పందనలు వచ్చాయి.

షాకాజమ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను పోస్టు చేసింది. అందులో తోపుడు బండిని తోసుకుంటూ వెళ్లుతున్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ ధరించే తన బండి (ఫోర్ వీలర్?)ని తోసుకెళ్లుతున్నాడు. తోపుడు బండిని తోసుకెళ్లుతున్న నీవు హెల్మెట్ ఎందుకు ధరించావు అని ఓ వ్యక్తి సదరు వ్యాపారిని అడిగాడు. అందుకు సమాధానంగా ఈ దారిలో ముందు పోలీసులు ఉంటారని, తాను హెల్మెట్ ధరించకుంటే తననూ ఆపేస్తారనే భయంతో హెల్మెట్ ధరించానని చెప్పాడు. ఈ సమాధానం విని ప్రశ్నించిన వ్యక్తి బిత్తరపోయాడు.

హెల్మెట్ ధరించాలనే నిబంధన కేవలం టూ వీలర్స్‌కు మాత్రమే అని ఆ వ్యాపారికి వివరించి చెప్పాడు. కానీ, నీది ఫోర్ వీలర్ కదా? అని అడిగాడు. కానీ, నిజంగా ఫోర్ వీలర్‌లకు వర్తించే నిబంధనలు నీ కోసం కాదని, ఎందుకంటే ఆ ఫోర్ వీలర్లు వేరు.. తోపుడు బండి వేరు అని చెప్పాడు. ఈ తోపుడు బండిని నువ్వు రోడ్డుకు ఒక వైపు కొన నుంచి తోసుకుంటూ వెళ్లితే సరిపోతుందని వివరించాడు. అంతే కానీ, హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ఆయనకు చెప్పాడు. ఇలా వివరిస్తున్నప్పుడూ సదరు వ్యక్తి మళ్లీ హెల్మెట్ ధరించే ప్రయత్నం చేశాడు.  దీంతో.. అతడిని మళ్లీ వారించి హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని చెప్పాడు. తోపుడు బండి తోసుకెళ్లుతున్న నీకు హెల్మెట్ లేదని పోలీసులు ఎవరూ నిన్న అడ్డుకోరని వివరించాడు.

Also Read: రియల్ స్టంట్‌మ్యాన్: 23 అంతస్తులపై కిటికీల మీది నుంచి సునాయసంగా దూకుతూ వెళ్లిన వ్యక్తి వీడియో వైరల్

ఆ వీడియోను పోస్టు చేస్తూ.. అన్నా మీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ పెట్టాడు.

ఈ వీడియోను అక్టోబర్ 9వ తేదీన పోస్టు చేశాడు. ఈ వీడియో రోజుల వ్యవధిలోనే వైరల్ అవుతున్నది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. ఆయన చట్టానికి భయపడే అతి సాధారణ వ్యక్తి అని, కానీ, కొందరి మాటలతో మిస్ గైడ్ అయ్యాడని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఆయన స్టూపిడ్ అయినా అయుండాలి లేదా అమాయకుడైనా అయుండాలి అని మరొకరు అభిప్రాయపడ్డాడు. జరిమానాల కారణంగా పోలీసులు అంటేనే జడుసుకునే అమాయకులు. బాధాకరమైన స్థితి ఇది. అట్టడుగు స్థాయి వరకు సరైన అవగాహన కల్పించలేకపోయారు అంటూ ఇంకో యూజర్ రాశాడు. అమాయకానికి పరాకాష్ట ఇది అని ఇంకొకరు కామెంట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్