Ayodhya: మేకలపై నుంచి వందే భారత్.. ట్రైన్ పై రాళ్లు విసిరిన కాపరి, ఇద్దరు కొడుకులు.. కేసు ఎవరిమీదంటే?

Published : Jul 11, 2023, 08:13 PM IST
Ayodhya: మేకలపై నుంచి వందే భారత్.. ట్రైన్ పై రాళ్లు విసిరిన కాపరి, ఇద్దరు కొడుకులు.. కేసు ఎవరిమీదంటే?

సారాంశం

యూపీలోని అయోధ్య జిల్లాలో ఓ వందే భారత్ ట్రైన్ మేకలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. దీంతో వాటిని కాస్తున్న ముగ్గురు ఆ ట్రైన్ పైకి రాళ్లు విసిరారు.  

ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు విసిరేసిన ఘటన చోటుచేసుకుంది. అయోధ్య  జిల్లాలో ఈ ఘటన జరిగింది. వందే భారత్ ట్రైన్ అయోధ్యలో మేకలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆరు మేకలు మరణించాయి. వాటికి కాపరిగా ఉన్న వ్యక్తి, ఆయన ఇద్దరు కొడుకు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే ఆ వందే భారత్ ట్రైన్ పై రాళ్లు విసిరారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

లఖౌరీ గ్రామానికి చెందిన మున్ను పాశ్వన్, ఆయన ఇద్దరు కొడుకు అజయ్ పాశ్వన్, విజయ్ పాశ్వన్‌లు మేకలకు మేత మేయించడానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారు ట్రైన్ పట్టాలను దాటాల్సి వచ్చింది. అదే సందర్భంలో అటు వైపుగా వందే భారత్ ట్రైన్ వచ్చింది. గోరఖ్‌పూర్ నుంచి లక్నోకు వెళ్లుతున్న వందే భారత్ ట్రైన్ సోహావాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆ మేకలపై నుంచి దూసుకెళ్లింది.

దీంతో ఆరు మేకలు అక్కడికక్కడే మరణించాయి. ఆ ముగ్గురు వెంటనే రాళ్లు తీసుకుని ట్రైన్ పైకి విసిరేశారు. ఈ ఘటనలో వందే భారత్ ట్రైన్ ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేవు. కానీ, ట్రైన్ కిటికీ ధ్వంసమైంది.

Also Read: కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడే దమ్ముందా? మక్కెలిరగ్గొడతారు: పవన్ కళ్యాణ్ పై రోజా మండిపాటు

పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘నాకు పట్టరాని కోపం వచ్చింది. ‘నా మేకలపై నుంచి వెళ్లిన ఆ ట్రైన్ వాటిని చంపేసింది’ అని మున్ను పాశ్వన్ అన్నారు. ఈ ఘటనపై ఓ కేసు నమోదు చేశామని అయోధ్య సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని వివరించారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం