
కేరళ విమాన ప్రమాదం నేపథ్యంలో వందే భారత్ మిషన్‌పై జరుగుతున్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. వందే భారత్ మిషన్ యథావిథిగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది.
కోజికోడ్ ప్రమాదంతో వందే భారత్ మిషన్‌పై ఎన్ఆర్ఐల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని పౌర విమానయాన శాఖ ట్వీట్ చేసింది.
Also Read:కేరళ విమాన ప్రమాదం లైవ్ అప్డేట్స్: 20కి చేరిన మృతులు
కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ మిషన్‌లో భాగంగా 191 మందితో దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.