రూ.కోటి విలువచేసే బంగారం చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్

Published : Aug 08, 2020, 02:20 PM IST
రూ.కోటి విలువచేసే బంగారం చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్

సారాంశం

ఢిల్లీలోని రాణీ ఝాన్సీ రోడ్డులో ఈ చోరీ జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఆ  సీసీటీవీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ప్రకారం.. నిందతులకు జట్టు పొడవు ఎక్కుగా ఉన్నట్లుగా గుర్తించారు. 

దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు రూ.కోటి విలువచేసే బంగారు నగలను చోరీ చేశారు. కాగా..  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. వారి నుంచి కోటి రూపాయలు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

కాగా.. నిందితులు సందీప్(22), సంతోష్ (20)లుగా గుర్తించారు. సందీప్ ఇంద్రపూరీ ప్రాంతానికి చెందినవాడు కాగా.. సంతోష్ మదనగిరి ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. ఈ దొంగతనం బుధవారం జరగగా.. శుక్రవారం కల్లా నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.

ఢిల్లీలోని రాణీ ఝాన్సీ రోడ్డులో ఈ చోరీ జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఆ  సీసీటీవీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ప్రకారం.. నిందతులకు జట్టు పొడవు ఎక్కుగా ఉన్నట్లుగా గుర్తించారు. ఆ చిన్న క్లూ ఆధారంగా వారిని పట్టుకున్నామని చెప్పారు.

నిందితుల్లో ఒకరైన సందీప్.. గతంలో రూ.70లక్షల నగదు చోరీ చేసి అరెస్టు అయ్యాడు. వీరిపై పలు పాత కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!