ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు రద్దు

Siva Kodati |  
Published : Nov 30, 2021, 07:10 PM IST
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు రద్దు

సారాంశం

ఉత్తరాఖండ్ ప్రభుత్వం (uttarakhand govt) సంచలన నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు (chardham devasthanam board) రద్దు చేసింది.  ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి (pushkar singh dhami) ప్రకటించారు. 

ఉత్తరాఖండ్ ప్రభుత్వం (uttarakhand govt) సంచలన నిర్ణయం తీసుకుంది. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు (chardham devasthanam board) రద్దు చేసింది.  ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి (pushkar singh dhami) ప్రకటించారు. 2019లో మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ (trivendra singh rawat) హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు.. రాష్ట్రవ్యాప్తంగా 51 దేవాలయాల వ్యవహారాలను నిర్వహించింది. వీటిలో ప్రసిద్ధ కేదార్‌నాథ్ (kedarnath), బద్రీనాథ్ (badrinath), గంగోత్రి (gangotri), యమునోత్రి (yamunotri) క్షేత్రాలు ఉన్నాయి.  

అయితే, ఆలయాలపై తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘించారంటూ.. బోర్డు ఏర్పాటు చేసినప్పటినుంచి పూజారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరి ఆందోళనలపై స్పందించిన ముఖ్యమంత్రి.. మనోహర్‌కాంత్ ధ్యాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమస్యపై అధ్యయనం చేసి ఇటీవలే తన నివేదికను సమర్పించింది. ప్యానెల్ సిఫార్సుల పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ధామి చెప్పారు.  

ప్రభుత్వ నిర్ణయంపై చార్‌ధామ్‌ పూజారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఒత్తిడి ఫలితంగానే ఇది సాధ్యమైనట్లు వారు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ (congress) నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ (harish rawat).. దీన్ని పూజారుల విజయంగా అభివర్ణించారు. సాగు చట్టాల మాదిరిగానే.. బీజేపీ దురహంకార వైఖరికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిందని రావత్ వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం