Uttarakhand elections 2022: ఉత్తరాఖండ్ ఎల‌క్ష‌న్స్.. కాంగ్రెస్ దూకుడు.. 45 మంది అభ్య‌ర్థుల ఖరారు !

By Mahesh RajamoniFirst Published Jan 1, 2022, 12:30 PM IST
Highlights

Uttarakhand elections 2022: ఈ ఏడాదిలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్త‌రాఖండ్ ఒక‌టి. ఈ క్ర‌మంలో ఎన్నిక‌లో విజ‌యమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థ‌లను సైతం ఖ‌రారు చేసింది. 
 

Uttarakhand elections 2022: ఈ ఏడాదిలో త్వ‌రలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లు హ‌డావిడి మొద‌లైంది. ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు క‌రోనా నేప‌థ్యంలో వాయిదాప‌డే అవ‌కాశ‌ముంద‌నే అనుమాన‌ల మధ్యే రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌చార హోరును సాగిస్తూ వ‌స్తున్నాయి. అయితే, ఇటీవ‌లే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మైన ఎన్నిక‌ల సంఘం ప్ర‌స్తుత ప‌రిస్థితుపై చ‌ర్చించింది. ఎన్నిక‌లను వాయిదా వేయ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశాయి. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గబోయే రాష్ట్రాల్లో ఉత్త‌రాఖండ్ కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే ఎలాగైనా అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌..  ఉత్తరాఖండ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తన అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 45 స్థానాలకు కాంగ్రెస్ త్వరలో  బ‌రిలో నిలుప‌బోయే అభ్య‌ర్థుల వివ‌రాల‌ను ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 15లోగా ఈ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించవచ్చని.. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తులు సైతం పూర్త‌య్యాయ‌ని  కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ హరీశ్ రావత్ తెలిపారు. అయితే, హరీష్ రావత్ ఎక్కడి నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు? అనే దానిపై కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే, గ‌తంలో జ‌రిగిన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయితే, రెండు స్థానాల్లో ఓడిపోయారు.

Also Read: Vaishno Devi Stampede: వైష్ణోదేవి ఆలయ విషాదానికి ఆదే కార‌ణ‌మా?.. అసలు ఏం జరిగింది?

ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ చివరి దశలో ఉందని ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ హరీశ్ రావత్ వెల్ల‌డించారు. రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 70 అసెంబ్లీ స్థానాలకు టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ప్యానెల్‌ను సిద్ధం చేసే బాధ్యతను  రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల సంఘం స్క్రీనింగ్ కమిటీకి అప్పగించింది. అయితే,  అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్‌దే తుది నిర్ణయం కానుంద‌ని స‌మాచారం. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు 478 దరఖాస్తులు రాగా, షెడ్యూల్డ్ కులాల నుంచి 92, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదు దరఖాస్తులు వచ్చాయి. 78 మంది మహిళల్లో 15 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఉన్నారు. 

Also Read: coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !

తాజాగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతల సమక్షంలో ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థుల పేర్లపై చర్చించింది. రెండు డజన్ల స్థానాలకు ముగ్గురు నుంచి నలుగురు పోటీదారులతో ప్యానెల్ సిద్ధం చేసింది. తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖాయమనీ, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి ఏమీ వెల్లడించలేదు. జనవరి 3న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ, జనవరి 9న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుందని.. అయితే,  హ‌రీష్ రావ‌త్ ఎన్నిక‌ల్లో  పోటీ చేయాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 

Also Read: R Value: దేశంలో క‌రోనా వైర‌స్ ఆర్‌-ఫ్యాక్టర్ ఆందోళ‌న !

click me!