
Uttarakhand Election news 2022 : ఉత్తరాఖండ్ (Uttarakhand) బ్రాండ్ అంబాసిడర్ (brand ambassador)
గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (bollywood actor akshay kumar) పని చేయనున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand cm pushkar singh dhami)ని అక్షయ్ కుమార్‌ను కలిశారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడారు. ‘‘ మేము అతనికి (అక్షయ్ కుమార్) ఒక ప్రతిపాదన ఇచ్చాము, అతను దానిని అంగీకరించాడు. అతను ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ ఇక నుంచి పని చేస్తాడు ’’ అని ఆయన ఓ మీడియా సంస్థతో వివరాలు పంచుకున్నారు. సోమవారం ఉదయం డెహ్రాడూన్ (Dehradun)లోని సీఎం నివాసంలో ఈ ఒప్పందం జరిగింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ (bharathiya janatha party-bjp) అధికార పార్టీగా ఉంది. ఈ సారి కూడా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా విస్తృతంగా ప్రచారాన్ని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రెజ్లర్ బబితా ఫోగట్ (rajlar bhabitha phogat) చేసిన వీడియోను ధామీ షేర్ చేశారు. ‘‘ భారతదేశ ప్రతిభావంతులైన క్రీడాకారిణి, యూత్ ఐకాన్ అయిన దంగల్ అమ్మాయి బబితా ఫోగట్ కు మా పట్ల (బీజేపీ ప్రభుత్వం) ఉన్న ఆప్యాయతకు ధన్యవాదాలు ’’ అని ఆయన ట్వీట్ (tweet) చేశారు.
ఇంటింటి ప్రచారానికి హాజరైన నడ్డా..
ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఉత్తరాఖండ్ లో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (bjp president jp nadda) హాజరయ్యారు. తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం గంగోత్రి (gangotri) లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లోని పేదలు, అణగారిన, అణగారిన, మహిళల సాధికారత కోసం పని చేసిందని తెలిపారు. ఈ సారి కూడా బీజేపీకి పూర్తి ఆశీర్వాదం అందించాలని కోరారు. అందరూ ఈ సారి బీజేపీ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతున్నారని ఇక్కడున్న ప్రజల ఉత్సాహం తెలుపుతోందని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు. ఉత్తరాఖండ్ ఉన్న 70 స్థానాల్లో కనీసం 60 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ అనుకుంటోంది. దానికి అనుగూణంగా ప్రణాళికలు కూడా చేస్తోంది. విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. జాతీయ స్థాయి నాయకులను ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల (star campaigners)నుప్రకటించింది. వారు షెడ్యూల్ ప్రకారం ఉత్తరాఖండ్ కు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ ఎన్నికల కోసం ఇండియా టీవీ (india tv) ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ (opinion poles) లో ఈ సారి కూడా బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది.