
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం లైంగిక వేధింపులు సహా పలు నేరపూరిత కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు భక్తులను రేప్ చేప్ చేశారనే కేసులో దోషిగా తేలిన ఆయన రోహతక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఆయనకు ఊరట లభించింది. తొలిసారి ఆయన జైలు విడిచి రావడానికి అనుమతులు లభించాయి. 21 రోజులు జైలు నుంచి విముక్తి పొందడానికి అనుమతులు వచ్చాయి. వచ్చే మూడు వారాలు డేరా బాబా జైలు బయటే ఉంటారని ఓ జైలు అధికారి ధ్రువీకరించారు.
గతంలో డేరా బాబాకు అత్యవసర పెరోల్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి ఆయనకు చాలా సార్లు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అత్యవసర పెరోల్ ఇచ్చారు. జైలులోని ప్రతి ఖైదీకి కొన్ని రోజులు ఇలా ఫర్లో పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని, అది ఖైదీల హక్కు అని హర్యానా జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతలా వివరించారు. అదే చట్టం డేరా చీఫ్‌కు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో గుర్మీత్ రాం రహీం విడుదల చర్చనీయాంశం అయింది. సిర్సాలోని డేరా సచ్చా సౌదాలో ఆయన ఉన్నప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై ఆయన ప్రభావం వేశారు. పంజాబ్‌లోని చాలా అసెంబ్లీ స్థానాల్లోనూ డేరా చీఫ్ ప్రభావం గట్టిగా ఉన్నది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఈ పరిణామంపై రియాక్ట్ అయ్యారు. ఎన్నికలకు గుర్మీత్ రాం రహీం ఫర్లోకు ఏం సంబంధం లేదని అన్నారు. చట్టం ప్రకారం ప్రతి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జైలులో మూడే ళ్లు కారాగార వాసం గడిపారని, అందుకే ఆయన ఫర్లోకు దరఖాస్తు చేసుకున్నాడని చెప్పారు.
తన అనుచరుడు, డేరా సచ్చా సౌదా మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ murder కేసులోనూ Dera Baba దోషిగా అని అక్టోబర్‌లో కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆయన లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. డేరా సచ్చా సౌదాలో మహిళలపై, మహిళా అనుచరులపై డేరా బాబా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నాడని ఓ అనామక లేఖను డేరా మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ ప్రచారం చేస్తున్నారని డేరా బాబా అనుమానించారు. కొన్నాళ్లు గమనించారు. అదే లేఖను హైలైట్ చేస్తూ సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి సంచలన కథనం రాశారు. దీంతో భక్తి ముసుగులో డేరా బాబా చేస్తున్న అరాచకాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం, ఆ జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి కూడా హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కేసులోనూ డేరా బాబా దోషిగా తేలడం గమనార్హం.