హెల్మెట్ లేదని బైక్ తాళం చెవిని నుదుటిపై గుచ్చాడు:పోలీసులపై తిరగబడ్డ జనం

By narsimha lodeFirst Published Jul 28, 2020, 5:48 PM IST
Highlights

హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. యువకుడి నుదుటిపై తాళంతో పొడిచారు.  ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకొంది.


డెహ్రాడూన్: హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. యువకుడి నుదుటిపై తాళంతో పొడిచారు.  ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకొంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్ పురా గ్రామానికి చెందిన  20 ఏళ్ల దీపక్ అనే యువకుడు మిత్రుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకొనేందుకు పెట్రోల్ బంక్ కు వెళ్తున్నాడు.

ఈ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ వాహనాన్ని నడిపారు.  ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. 

కోపంతో ఓ కానిస్టేబుల్  బండి తాళం చేవితో దీపక్ నుదుటిపై బలంగా గుచ్చాడు. నుదుటిపైనే తాళం చెవి ఉండిపోయింది. అలాగే దీపక్ గ్రామానికి వెళ్లాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చెప్పాడు. 

ఆగ్రహంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. దీపక్ పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. 

గ్రామస్తులను నిలువరించలేకపో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.  పోలీసులపై గ్రామస్తులు రాళ్లురువ్వారు. రాళ్లు రువ్విన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

ఈ ఘటనలో పాల్గొన్న ఓ ఎస్ఐ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.ఈ విషయం తెలుసుకొన్న స్థానిక ఎమ్మెల్యే రాజ్ కుమార్ తుక్రాల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు. ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
 

click me!