ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ కి కరోనా.. పరిస్థితి విషమం

Published : Dec 28, 2020, 08:24 AM ISTUpdated : Dec 28, 2020, 08:28 AM IST
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ కి కరోనా.. పరిస్థితి విషమం

సారాంశం

త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించడంతో డూస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ మధ్యే ఈ మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైంది. అది  చాలదన్నట్లు యూకే నుంచి మరో కొత్త రకం కరోనా కూడా ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. కాగా.. తాజాగా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించడంతో డూస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. డూన్ ఆసుపత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి రావత్, అతని భార్య, కుమార్తెలకు డిసెంబరు 18న కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. 

ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా ప్రభుత్వం కరోనా గైడ్‌లైన్స్ కఠినంగా అమలు చేసే పనిలో పడింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని ప్రచారం చేస్తోంది. వేడుకలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu