నడి రోడ్డుపై దుస్తులు విప్పి.. మహిళతో అసభ్య ప్రవర్తన

Published : Dec 28, 2020, 07:35 AM IST
నడి రోడ్డుపై దుస్తులు విప్పి.. మహిళతో అసభ్య ప్రవర్తన

సారాంశం

తను కారులో కూర్చొని ఉండగా ఓ స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని మర్మాంగాన్ని తనకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ 

నడి రోడ్డుపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన ఒంటి మీద దుస్తులు అన్నీ విప్పేసి...ఓ మహిళకు తన మర్మాంగాలను చూపిస్తూ.. లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.  కాగా..తను కారులో కూర్చొని ఉండగా ఓ స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని మర్మాంగాన్ని తనకు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫ్లైవేలో కారులో ఓ యువతి వెళ్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తున్నాడు. కారు నడుపుతున్న యువతి వాహనాన్ని పక్కన ఆపిన సమయంలో.. స్కూటరుపై ఉన్న సదరు వ్యక్తి ఆ కారు వద్దకు వచ్చాడు. గబగబా తన స్కూటర్ దిగేశాడు. ఆ వెంటనే ఆమెకు తన మర్మాంగం కనిపించేలా ప్రవర్తించాడు. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను మూత్ర విసర్జన చేయడం కోసం ఇలా చేశానని, అంతేగానీ మరే ఉద్దేశ్యమూ లేదని సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu