ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆరా తీశారు. మంగళవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రానీ భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో.. రాష్ట్రం మొత్తాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతికి బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చంపావత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్..వరద ఉధృతికి కూలిపోయింది. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఓ కారును తీవ్రంగా శ్రమించి క్రేన్ సాయంతో బయటకు తీశారు రెస్క్యూ టీమ్. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
కాగా.. ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ప్రధాని నరేంద్రమోదీ.. ఆరా తీశారు. మంగళవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.
undefined
"పిఎం మోదీ ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ మంత్రి అజయ్ భట్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను ప్రధాని పరిశీలించారు" అని అధికార వర్గాలు తెలిపాయి.
నిన్న, ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు , వరదల కారణంగా రాష్ట్ర పరిస్థితిని మోదీకి వివరించారు. ఈ నేపథ్యంలో మోదీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిన సమీక్షించారు.
గతంలో, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధిక వర్షపాతం గురించి సంబంధిత అధికారుల నుండి వివరణాత్మక సమాచారాన్ని తీసుకున్నారు. అతను రాష్ట్ర సచివాలయంలోని విపత్తు నియంత్రణ గది నుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Also Read: Kerala Floods: ఒకే కుటుంబంలో ఆరుగురు బలి..!
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్ జారీ చేసింది, రాష్ట్రంలో సోమవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. కేరళ రాష్ట్రాన్ని కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, వరదల ధాటికి కేరళలో మృతుల సంఖ్య 38కి చేరింది. కొట్టాయం జిల్లా కూట్టిక్కల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వరదలకు నలుగురు చిన్నారులతో సహా ఓ కుటుంబమంతా జలసమాధి అయిపోయింది. 10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.