Kerala Floods: ఒకే కుటుంబంలో ఆరుగురు బలి..!

By telugu news teamFirst Published Oct 19, 2021, 10:26 AM IST
Highlights

రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పైగా భారీ వరద పొటేత్తింది. 

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేసేస్తున్నాయి. ఈ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భారీ వర్షం కొట్టాయం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మనుషుల్ని మింగేసింది. వరదలో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  కొట్టాయం జిల్లాకు చెందిన కావాలి ప్రాంతంలో మార్టిన్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తుండేవాడు. మార్టిన్‌కు భార్య, ముగ్గరు పిల్లలు. మార్టిన్‌ అమ్మ కూడా వారితో పాటే ఉండేది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పైగా భారీ వరద పొటేత్తింది. 

Also Read: ప్రేమించి పెళ్లిచేసుకుని.. మరొకరితో లవ్ లో పడ్డ భార్య.. భర్త అడ్డుతొలగించుకోవాలని దారుణం.


ఈ క్రమంలో మార్టిన్‌ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ఈ సంఘటనలో మార్టిన్‌ కుటుంబ సభ్యులంతా మృతి చెందారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. వీరికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచి వేసింది. ఆ ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. మొత్తంగా మూడు తరాలకు చెందిన వారి కుటుంబంలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరి మృతి పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఉద్యోగం కోసం వెడితే యువతిని ప్రేమలో దింపి.. సరోగసి రాకెట్ లో ఇరికించి..

click me!