Uttarakhand Accident : రెండు రోజుల కిందట జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మర్చిపోక ముందే అలాంటి ప్రమాదమే తాజాగా ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. ఓ పికప్ వ్యాన్ నైనిటాల్ జిల్లాలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
vehicle falls into gorge : ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఖల్కండాలోని ఛీరకాన్-రీతసాహిబ్ రహదారిపై పికప్ వాహనం లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
నైనిటాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. పాట్లోట్ నుండి అమ్జద్ గ్రామానికి వెళ్తున్న వాహనం 8 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను తప్పించే ప్రయత్నంలో వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. చనిపోయిన వారిలో దంపతులు, వారి కుమారుడు కూడా ఉన్నారు.
undefined
ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఓఖల్కండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేర్పించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
छेडाखान मीडार मोटर मार्ग, नैनीताल में वाहन के दुर्घटनाग्रस्त होने से 8 लोगों के हताहत होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ।
ईश्वर दिवंगतों की आत्मा को शांति एवं शोकाकुल परिजनों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें।
बाबा केदार से घायलों के शीघ्र स्वास्थ्य लाभ की…
ఇలాంటి ఘటనే రెండు రోజుల కింద జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకుంది. నవంబర్ 15వ తేదీన కిష్త్వార్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు బస్సు దోడా ప్రాంతంలోని అస్సార్ ప్రాంతంలో 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పలు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని పీఎంవో పేర్కొంది.